హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో ఓవర్ లోడ్ వాహనాలపై రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. చేవెళ్ల సంఘటన నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో పలు గూడ్స్ వాహనాలను తనిఖీ చేశారు. బుధవారం నాగోల్ లో చేపట్టిన తనిఖీల్లో ఓవర్ లోడ్ తో వెళ్తున్న మూడు వాహనాలను అధికారులు తనిఖీ చేశారు.
వేగంతో పాటు అనుమతులకు మించి సరుకు రవాణా చేస్తున్న మూడు ఓవర్ లోడ్ తో తీసుకెళుతున్న ప్రైవేట్ ట్రక్ లు, ఇసుక ఇటుకలు, మెటల్తో ప్రయాణిస్తున్న గూడ్స్ క్యారియర్ వాహనాల పై కేసులు నమోదు చేశారు. 5.6 టన్నుల లోడ్ తో వెళ్తున్న ఇసుక లారీ, 7.5 టన్స్ తో వెళ్తున్న ఇటుకల లారీ, 4.2 టన్స్ తో వెళ్తున్న కంకర టిప్పర్లను సీజ్ చేశారు.
