ఆర్టీసీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి : ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ కార్మికుల సమస్యలను  అసెంబ్లీలో ప్రస్తావించాలి : ఆర్టీసీ జేఏసీ
  • మంత్రులకు ఆర్టీసీ జేఏసీ వినతి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. శుక్రవారం వారు అసెంబ్లీలోని పలువురు మంత్రుల చాంబర్లకు వెళ్లి వినతి పత్రం అందజేశారు. మంత్రులు దామోదర రాజ నర్సింహా, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణా రావు,  అడ్లూరి లక్ష్మణ్ లతో పాటు ఎమ్మెల్యేలు అక్బరుద్దిన్, కూనంనేని సాంబ శివరావు, మధుసూదన్ రెడ్డిలను ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, ఇతర ప్రతినిధులు సురేశ్, యాదయ్య, యాదగిరి కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు స్పందిస్తూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు.