తన ఫ్యామిలీ పార్టీకి అందర్నీ రెడీగా ఉండమంటోంది సమంత. అయితే ఇది ఆమె నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా కోసం. ఈ చిత్రంలోని మొదటిపాట గురించి అప్‌డేట్ ఇచ్చింది సమంత. ఇదొక ఫ్యామిలీ పార్టీ సాంగ్ అని చెబుతూ చిన్న ప్రోమో విడుదల చేసింది. ఇందులో ట్రెడిషినల్‌గా కనిపిస్తూ తన ఫ్యామిలీతో కలిసి స్టెప్స్ వేస్తూ ఇంప్రెస్ చేసింది. ఏప్రిల్ 16న ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సమంతకు చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ స్పెషల్‌గా మే 15న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
ఈ యాక్షన్ డ్రామా మూవీని అన్ని కమర్షియల్ అంశాలతోపాటు బలమైన ఎమోషన్స్‌తో రూపొందిస్తున్నట్టు మేకర్స్ చెప్పారు. ఓ బేబి’ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది.

