సెంచరీ తర్వాత ఎమోషనల్ అయిన సర్ఫరాజ్

సెంచరీ తర్వాత ఎమోషనల్ అయిన సర్ఫరాజ్

రంజీ ట్రోఫీలో ముంబయి ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ పరుగుల వరద పారిస్తున్నాడు. సెంచరీలతో అదరగొడుతున్నాడు.  తాజాగా రంజీ ట్రోఫీ ఫైనల్లో  మరో సెంచరీతో చెలరేగాడు.  మధ్యప్రదేశ్ తో జరుగుతున్న ఫైనల్లో సర్ఫరాజ్ సెంచరీ చేయడంతో ముంబయి 374 రన్స్ చేసింది. వరుస వికెట్లు పడుతున్న సర్ఫరాజ్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ జట్టుకు మంచి స్కోర్ ను అందించారు.

అయితే సెంచరీ తర్వాత సర్ఫరాజ్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. బీసీసీఐ షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. రెండో రోజు 40 రన్స్ తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సర్ఫరాజ్ 134 రన్స్ చేసి ఔటయ్యాడు. మొదటి 50 రన్స్ కు 152 బాల్స్ ఆడిన అతడు తర్వాత 50 రన్స్ ను 38 బాల్స్ లోనే చేశాడు. రంజీ ట్రోఫి ప్రారంభం నుంచి సర్ఫరాజ్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే 275 రన్స్ చేసిన అతడు ఆతర్వాత వరుసగా 63,48,165,153,40,59,134 రన్స్ చేశాడు.  

ముందుగా టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకుంది ముంబయి. కెప్టెన్ పృథ్వి షా, యశస్వి జైపాల్ కలిసి తొలివికెట్ కు 87 రన్స్ చేశారు. షా ఔటైన తర్వాత వరుస వికెట్లు పడగా సర్ఫరాజ్ మాత్రం ఆచితూచి ఆడుతూ సెంచరీ సాధించాడు. ఇక యశస్వి కూడా 78 రన్స్ చేయడంతో ముంబయి 374 రన్స్ చేయగల్గింది. ఇక మధ్యప్రదేశ్ బౌలర్ గౌరవ్ యాదవ్ 4వికెట్లు పడగొట్టగా..అనుభవ్ అగర్వాల్ కు 3 వికెట్లు దక్కాయి.