కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని సశస్త్ర సీమ బల్ హెడ్ కానిస్టేబుల్ (పారా మెడికల్ స్టాఫ్) గ్రూప్–సి నాన్ గెజిటెడ్ (కాంబాటైజ్డ్), నాన్ -మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 20న ముగుస్తుంది.
పోస్టు పేరు: హెడ్ కానిస్టేబుల్(పారా మెడికల్ స్టాఫ్).
మొత్తం ఖాళీలు: 76. హెడ్ కానిస్టేబుల్ (లాబొరేటరీ అసిస్టెంట్) 30, హెడ్ కానిస్టేబుల్ (సైకోథెరపి అసిస్టెంట్) 12, కానిస్టేబుల్ (నర్సింగ్ అసిస్టెంట్ కం మెడిక్) 34.
ఎలిజిబిలిటీ
హెడ్ కానిస్టేబుల్ (లాబొరేటరీ అసిస్టెంట్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి బయాలజీ ఒక సబ్జెక్టుగా 12వ తరగతిలో ఉతీర్ణత సాధించి ఉండాలి. కనీసం ఏడాది వ్యవధి కలిగిన లాబొరేటరీ అసిస్టెంట్ కోర్సు పూర్తిచేసి ఉండాలి. లాబ్ అసిస్టెంట్‌గా కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
హెడ్ కానిస్టేబుల్ (సైకోథెరపి అసిస్టెంట్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి12వ తరగతిలో ఉతీర్ణత సాధించి ఉండాలి. కనీసం ఏడాది వ్యవధి కలిగిన సైకోథెరపి కోర్సు పూర్తిచేసి ఉండాలి. సైకో థెరపి అసిస్టెంట్‌గా కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
కానిస్టేబుల్ (నర్సింగ్ అసిస్టెంట్ కం మెడిక్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో ఉతీర్ణత సాధించి ఉండాలి. సెయింట్ జాన్స్ అంబులెన్స్ ఆర్గనైజేషన్ లేదా రెడ్‌క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రథమ చికిత్స సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: కనీస వయసు 18 ఏండ్లు. గరిష్ట వయసు 27 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీ, మాజీ సైనికులకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 21.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 20
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ssb.gov.inను సందర్శించండి.
సెలెక్షన్ ప్రాసెస్
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. స్టేజ్– I ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్ టీ). హెడ్ కానిస్టేబుల్ (లాబొరేటరీ అసిస్టెంట్), హెడ్ కానిస్టేబుల్ (సైకోథెరపి అసిస్టెంట్): పురుషులు1.6 కి.మీ. పరుగును 6 నిమిషాల 30 సెకన్లు, మహిళలు 800 మీ. పరుగును 4 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.
కానిస్టేబుల్ (నర్సింగ్ అసిస్టెంట్ కం మెడిక్): పురుషులు 4.8 కి.మీ.ల పరుగును 24 నిమిషాలు, మహిళలు 2.4 కి.మీ.ల పరుగును 18 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. మాజీ సైనికులకు పీఈటీ నుంచి మినహాయింపు ఉంటుంది. నిర్ణీత ప్రమాణాల ప్రకారం ఎత్తు, బరువు, ఛాతీ ప్రమాణాలను కలిగి ఉండాలి.
స్టేజ్-II: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)
హెడ్ కానిస్టేబుల్ (లాబొరేటరీ అసిస్టెంట్), హెడ్ కానిస్టేబుల్ (సైకోథెరపి అసిస్టెంట్): ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. రెండు పార్టులు ఉంటాయి. పార్ట్–Iలో జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్/ హిందీ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు అడుగుతారు. పార్ట్-–IIలో టెక్నికల్ సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
కానిస్టేబుల్ (నర్సింగ్ అసిస్టెంట్ కం మెడిక్): ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్/ హిందీ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
స్టేజ్-III: డాక్యుమెంట్ వెరిఫికేషన్, డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (డీఎంఈ)/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
