
శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్‌లో రాజేష్ ఎం.సెల్వా దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్‘ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్’. నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది. గురువారం సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేశారు. అక్టోబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఇది అందుబాటులోకి రానుంది.
ఓ గేమ్ డెవలపర్ జీవితం చుట్టూ తిరిగే కథ ఇది. శ్రద్ధా శ్రీనాథ్ ఆ పాత్రను పోషించింది. జీవితంలో తనకు ఎదురైన సమస్యలను ఆమె ఎలా అధిగమించింది అనేది మెయిన్ కాన్సెప్ట్. ‘ఇదొక థ్రిల్లర్ మాత్రమే కాదు.. ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించే అద్దం. మన వ్యక్తిగత సమాచారంతో పాటు రహస్యాలన్నీ డిజిటల్‌గా క్యాప్చర్ అవుతున్నాయి. నిజానికి, మోసానికి మధ్య ఉన్న సన్నని గీతనే ఈ వెబ్ సిరీస్’ అని దర్శకుడు రాజేష్ ఎం సెల్వా తెలియజేశాడు.
The Game, out 2 October, only on Netflix.#TheGameOnNetflix https://t.co/niIR0Np2xm
— Netflix India (@NetflixIndia) September 4, 2025
ఈ స్టోరీ ఓ మహిళా గేమ్ డెవలపర్ చుట్టూ తిరుగుతుంది. తనపై జరిగిన ఒక కోఆర్డినేటెడ్ అటాక్‌కి కారణమైన వాళ్లను కనిపెట్టడానికి ఆమె ప్రయత్నిస్తుంది. దీనికి దీప్తి గోవిందరాజన్ కథ అందించారు. శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్‌లో నటించగా.. సంతోష్ ప్రతాప్, చందినీ, శ్యామ హరిని, బాల హసన్, సుబాష్ సెల్వం, వివియా సంతోష్, ధీరజ్, హేమ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.