మనోహరాబాద్, వెలుగు: మండల కేంద్రంలోని పీఎస్లో శనివారం ఎస్ఐ సుభాష్గౌడ్ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ హైస్కూల్విద్యార్థులకు ఆయుధాల వినియోగంపై అవగాహన కల్పించారు.
పోలీస్ శాఖ నిర్మాణం, విధులు, బాధ్యతలు, నేర నియంత్రణలో పోలీసుల పాత్ర గురించి వివరించారు. పీఎస్లో పోలీసులు ఉపయోగించే సాంకేతిక పరికరాలు, రికార్డుల నిర్వహణను తెలియజేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
