వికారాబాద్ జిల్లాలో  అధ్వాన్నంగా పశుసంవర్ధక శాఖ పనితీరు

వికారాబాద్ జిల్లాలో  అధ్వాన్నంగా పశుసంవర్ధక శాఖ పనితీరు
  • తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు
  • రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ గట్టి హెచ్చరిక

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో పశుసంవర్ధక శాఖ పనితీరు అధ్వాన్నంగా ఉందని రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కార్యాలయాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. డీవీహెచ్ఓ డాక్టర్ సదానందం సహా ఇతర అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే పద్ధతి మార్చుకోవాలని, గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు పెంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయించాలని, సిబ్బంది కచ్చితంగా పని వేళలు పాటిస్తూ రైతులకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. త్వరలో జిల్లాకు మళ్లీ తనిఖీకి వస్తానని, అప్పటికి మార్పు రాకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.