ఈ వారంలో మొదటి రోజే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం ఉదయం ట్రేడింగ్ నష్టాల్లోనే ప్రారంభమవగా.... ఈ క్షీణత నుండి మార్కెట్ కోలుకోలేకపోయింది. దింతో మధ్యాహ్నం నుండి స్టాక్ మార్కెట్ ముగిసేలోపు రెండు సూచీలు నష్టాల్లో కొనసాగుతూ ముగిశాయి.
విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణలు, ప్రపంచ సుంకాలకు సంబంధించిన అనిశ్చితులు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావం చేశాయి. అంతేకాకూండా ట్రంప్ సుంకాలు కూడా భయానక వాతావరణాన్ని సృష్టించాయి, ఈ కారణంగా పెట్టుబడిదారులు భారత మార్కెట్‌ను విడిచిపెట్టి సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లడం ప్రారంభించారు. బిఎస్‌ఇ సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభంలో 320.69 పాయింట్ల పతనంతో ప్రారంభమై 600 పాయింట్లకు పైగా పడిపోగా... కానీ మధ్యాహ్నం క్షీణత మందగించింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొని 130 పాయింట్లకు పైగా పడిపోయింది.
ఈరోజు మార్కెట్ ట్రేడింగ్ ఎలా ఉందంటే :
ఉదయం ట్రేడింగ్ సమయంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ 320.69 పాయింట్లు క్షీణించి 83,249.66 వద్ద ప్రారంభమవగా... ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 124.60 పాయింట్లు క్షీణించి 25,573.40 వద్ద ప్రారంభమైంది. అయితే చివరికి సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా పడిపోయి 83,150 వద్ద ముగియగా... నిఫ్టీ 50 150 పాయింట్లకు పైగా పడిపోయి 25,600 వద్ద ముగిసింది.
ఈరోజు లాభాల్లో, నష్టాల్లో ఉన్న టాప్ షేర్లు ఇవే:
స్టాక్ మార్కెట్ క్షీణత మధ్య సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అయితే, టెక్ మహీంద్రా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు లాభపడ్డాయి.
