బాయ్​ఫ్రెండ్​ చీట్​ చేస్తే..

బాయ్​ఫ్రెండ్​ చీట్​ చేస్తే..

బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ తనయ సుహానా ఖాన్(Suhana Khan)​ సినీ ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్​లో ‘ది ఆర్చీస్’​ అనే సినిమాతో తెరంగేట్రం చేయనుంది. డిసెంబర్​7న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక సుహానా పలు ఇంటర్వ్యూల్లో సందడి చేస్తోంది. బాలీవుడ్​ మీడియా నుంచి ఈ సుందరికి ఓ ఇంట్రెస్టింగ్​ప్రశ్న ఎదురైంది. మీ బాయ్​ఫ్రెండ్​ మిమ్మల్ని వదిలేస్తే ఏం చేస్తారు? అని ఆమెను అడిగారు. 

దీనికి బదులిస్తూ.. నా బాయ్​ఫ్రెండ్​ నన్ను కాకుండా ఇతర అమ్మాయిలతో రిలేషన్​లో ఉన్నాడని తెలిసినా.. నన్ను చీట్ చేసినా వెంటనే అతడిని వదిలేస్తాను అని సుహానా చెప్పింది. తాను మోసాన్ని భరించలేనని తెలిపింది. జీవితాంతం ఒకే అమ్మాయితో ఉండాలనుకునే వ్యక్తినే తాను ఇష్టపడతానని వెల్లడించింది. ఇక సుహానా తొలి సినిమా నెట్​ఫ్లిక్స్​ లో రిలీజ్​ కానుంది. 

రీసెంట్ గా ఈ బ్యూటీ తన తల్లి గౌరీ ఖాన్‌తో కలిసి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఈవెంట్‌ నుంచి బయటకు వస్తుండగా.. ఒక మహిళా సుహానా ఖాన్‌ దగ్గరకు వెళ్లి సహాయం చేయమని అడిగింది. దీంతో వెంటనే తన బ్యాగ్‌లో నుంచి ఐదువందల రూపాయల నోట్లను తీసి ఇచ్చేసింది సుహానా. ఇదంతా ఒక వ్యక్తి తన కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దాంతో అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ సుహానాపై ప్రశంసల వర్షం కురిపించారు