ధిక్కార కేసుల విచారణలో ఎమోషనల్ కావొద్దు!

ధిక్కార కేసుల విచారణలో  ఎమోషనల్ కావొద్దు!

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కార కేసుల విచారణ సందర్భంగా ఎమోషనల్ కావొద్దని, ధిక్కార తీవ్రత ఆధారంగా జ్యుడీషియల్ పరిధికి లోబడి శిక్ష విధించాలని సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టు న్యాయమూర్తులకు సూచించింది. కలకత్తా హైకోర్టు తీర్పును కొట్టేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ ఈ కామెంట్స్ చేసింది. ఈ కేసులో వైద్యుడి లైసెన్సును రద్దు చేయడం సరికాదని బెంచ్​ అభిప్రాయపడింది. ఓ వైద్యుడు కోర్టు ధిక్కరణకు పాల్పడడం ప్రొఫెషనల్ మిస్ కండక్ట్ కిందికే వస్తుందని అంటూనే.. ధిక్కార తీవ్రతను, దాని స్వభావాన్ని కూడా అంచనా వేసి ఆ తర్వాతే తీర్పు వెలువరించాలని బెంచ్ పేర్కొంది.

ఇదీ కేసు..

కలకత్తాలో ఓ వైద్యుడికి సంబంధించిన ఓ నిర్మాణం అక్రమమని తేల్చిన కోర్టు.. వాటిని కూల్చేయాలని ఆదేశించింది. అక్రమ నిర్మాణంలో కొంత ఏరియా మినహా మిగతా దంతా వైద్యుడు కూల్చేశారు. దానిని కూడా తొలగిస్తే పక్కనే ఉన్న తన ఇల్లు కూలిపోతుందని డాక్టర్ వాదిస్తున్నారు. అక్రమ నిర్మాణం పూర్తిగా తొలగించలేదంటూ అధికారులు కోర్టుకెక్కగా.. వైద్యుడి తీరును కోర్టు ధిక్కారంగా  తేల్చి అతడి మెడికల్​ లైసెన్స్ ను రద్దు చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.