పన్ను బకాయిదారులకు రెడ్ నోటీసులు.. తాండూరులో అందజేసిన మున్సిపల్ కమిషనర్ 

పన్ను బకాయిదారులకు రెడ్ నోటీసులు.. తాండూరులో అందజేసిన మున్సిపల్ కమిషనర్ 

తాండూర్​, వెలుగు: తాండూరు మున్సిపాలిటీలో దీర్ఘకాలంగా ఆస్తి పన్ను చెల్లించకుండా మొండికేస్తున్న యజమానులపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదివారం పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, బకాయిదారులకు రెడ్ నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని, నోటీసులు అందుకున్న వారు వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలని కోరారు.

పన్నుల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తే తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం ఆస్తులను జప్తు చేయడానికీ వెనుకాడబోమని హెచ్చరించారు. మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఆర్ ఐ రాములు, వార్డ్ ఆఫీసర్లు స్నేహాలతా రెడ్డి, అనిల్​కుమార్ పాల్గొన్నారు.