ఇండియా ఈ వ్యర్ధాల బంగారు గని : 23 కోట్ల అక్రమ రవాణా సీజ్.. మీ పాత ఎలక్ట్రానిక్స్ కూడా విలువైనవేనా?

ఇండియా ఈ వ్యర్ధాల బంగారు గని : 23 కోట్ల అక్రమ రవాణా సీజ్.. మీ పాత ఎలక్ట్రానిక్స్ కూడా విలువైనవేనా?

ముంబైలోని నవా షెవా పోర్టులో అక్రమంగా తరలిస్తున్న  రూ.23 కోట్ల విలువైన  ఈ-వ్యర్థాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI)  స్వాధీనం చేసుకుంది. ఈ అల్యూమినియం స్క్రాప్‌ల మధ్య దాచిన 17వేల ల్యాప్‌టాప్‌లు, వేలకొద్దీ CPUలు ఇంకా  చిప్‌లు ఉన్నాయి.

ఇంత ఎక్కువ మొత్తంలో చెత్త ఎక్కడి నుంచి వస్తోంది..? మనం నిజంగా ఈ-వ్యర్థాలను తయారు చేస్తున్నామా..? వ్యక్తిగతంగా జాగ్రత్త  వహించాల్సిన సమయం వచ్చిందా?

అసలు ఈ-వ్యర్థాలు అంటే ఏంటి: ఈ-వ్యర్థాలు అంటే పనికిరాని లేదా పడేసిన పాత ఎలక్ట్రానిక్ వస్తువులు. అంటే పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు ఇంకా ఇతర ఇళ్లలో లేదా ఆఫీసుల్లో ఉండే ఎలక్ట్రానిక్స్ వస్తువులు.

వీటిలో సీసం, పాదరసం, కాడ్మియం వంటి విషపూరిత పదార్థాలు ఉంటాయి. వీటిని సరిగా పారవేయకపోతే పర్యావరణానికి, ఆరోగ్యానికి చాలా ప్రమాదం జరుగుతుంది.

ఈ-వ్యర్థాలలో బంగారం, వెండి, రాగి వంటి విలువైన లోహాలు కలిసి ఉంటాయి. వాటిని రీసైకిల్ చేస్తే తిరిగి వాడుకోవచ్చు. అందుకే వీటిని రహస్య బంగారం అని కూడా అంటారు.

 ఈ-వ్యర్థాలు  ఎక్కడి నుంచి వస్తున్నాయి : ప్రస్తుతం ఈ-వ్యర్థాలు పెరగడానికి ముఖ్య కారణం ఎలక్ట్రానిక్స్ మార్కెట్ వేగంగా పెరగడం. ఇంకా పాత ఎలక్ట్రానిక్ వస్తువులను పడేసి కొత్తవి కొనే ట్రెండ్‌ పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికా, యూరప్ వంటి దేశాలు మొదట్లో ఈ-వ్యర్థాలు ఎక్కువగా తయారు చేసేవి. అక్కడ కఠినమైన చట్టాలు ఉండటంతో ఖర్చు తగ్గించుకోవడానికి ఈ-వ్యర్థాలను భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పంపడం మొదలుపెట్టాయి.
 
ఈ-వ్యర్థాల వల్ల దేశానికి చాలా నష్టం జరుగుతోంది. ముఖ్యంగా పర్యావరణం ఇంకా ఆరోగ్యం. అక్రమంగా రీసైక్లింగ్ చేయడం వల్ల నీరు, భూమి కలుషితం అవుతున్నాయి. ఈ కలుషితం వల్ల  రోగాల బారిన పడ్డ వారికి వైద్యం అందించడానికి చాలా ఖర్చు అవుతుంది. ఈ-వ్యర్థాల కారణంగా దేశానికి సంవత్సరానికి దాదాపు రూ. 80వేల కోట్ల వరకు ఆర్థిక నష్టం జరగవచ్చని అంచనా.
 
ఈ-వ్యర్థాలు వల్ల ఎవరికి  ప్రయోజనం: ఈ-వ్యర్థాలలో బంగారం, వెండి, రాగి, అరుదైన మట్టి లోహాలు వంటి విలువైన పదార్థాలు ఉంటాయి, వీటిని రీసైక్లింగ్  ద్వారా తిరిగి పొందవచ్చు. ఉదాహరణకు, భారతదేశ ఈ-వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమ $1.5 బిలియన్ల రంగంగా అభివృద్ధి చెందింది, ఉపాధి అవకాశాలను అందిస్తూ, ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతోంది.  అయితే ఈ ప్రయోజనాలు పర్యావరణ, ప్రజారోగ్య భద్రతపై దృష్టి పెడుతూ సరైన రీసైక్లింగ్ పద్ధతులు, చట్రాల అమలుపై ఆధారపడి ఉంటాయి.

ALSO READ : తెలంగాణలో ఎలి లిల్లీ రూ.9 వేల కోట్ల పెట్టుబడులు

మీ పాత ఎలక్ట్రానిక్స్ వస్తువులు పనిచేయకపోతే వాటిని పడేయకుండా రిపేర్ చేయించి వాడుకోండి. ఇంకా వస్తువులు పనిచేస్తున్నా కూడా కొత్తవి కొనే ఆలోచనతో మానుకోండి. 

ఉదాహరణకు, ఢిల్లీ లో ఈ-వేస్ట్ ఎకో పార్క్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఈ-వేస్ట్‌ నిర్వహించే దిశగా ఒక అడుగు. ఈ-వ్యర్థాల అక్రమ రవాణాని అరికట్టడానికి పర్యావరణపరంగా మంచి పద్ధతిలో దానిని ప్రాసెస్ చేయడానికి అంతర్జాతీయ సహకారం కూడా చాలా అవసరం.