హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీ వైస్ చాన్స్లర్ జానయ్యపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో గురువారం రాష్ట్ర మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. వీసీ జానయ్యతో పాటు ఫిర్యాదురాలు కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ ఇరువురిని వేర్వేరుగా విచారించి, ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంది. అన్ని ఆధారాలను సిద్ధం చేసుకుని, తదుపరి విచారణకు హాజరుకావాలని ఇరువురిని కమిషన్ ఆదేశించింది.
