రాష్ట్రంలో కల్లును నిషేధించే కుట్ర : బాలగోని బాలరాజు గౌడ్

రాష్ట్రంలో కల్లును నిషేధించే కుట్ర : బాలగోని బాలరాజు గౌడ్
  • బాలగోని బాలరాజు గౌడ్ ఆరోపణ

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో కల్లును నిషేధించే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాలు సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ ఆరోపించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ కల్లు దుకాణాల మీద ఎక్సైజ్ ఆఫీసర్లు దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. 

ఒక దగ్గర జరిగిన సంఘటనను రాష్ట్రంలోని మొత్తం కల్లు దుకాణాలకు ఆపదించడం సరికాదన్నారు. కూకట్​పల్లిలో జరిగిన కల్తీ కల్లు ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లిక్కర్ అమ్మకాలు పెంచేందుకు కల్లు గీత వృత్తి పట్ల దుష్ప్రచారం తగదన్నారు.