కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ లో టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు చాలామంది నేతలు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా రాజీనామాలకు సిద్దమవుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ కోసం ప్రయత్నించారు. జడ్చర్ల, నారాయణ పేట్ లో టికెట్ కోసం ప్రయత్నం చేశారు ఎర్ర శేఖర్. ఎల్లారెడ్డి టిక్కెట్ పై ఆశలు పెట్టుకొని నిరాశ చెందారు సుభాష్ రెడ్డి. గాలి అనిల్ నర్సాపూర్ టిక్కెట్ ఆశించారు. హుజురాబాద్ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు బల్మూరి వెంకట్.
ఇక హుస్నాబాద్ టిక్కెట్ ఆశించారు ప్రవీణ్ రెడ్డి. మహాబూబాబాద్ టిక్కెట్ వస్తుందని భావించారు బలరాం నాయక్, బెల్లయ్య నాయక్. పాలకుర్తి టిక్కెట్ వస్తుందని నమ్మకం పెట్టుకున్నారు తిరుపతిరెడ్డి. జూబ్లీహిల్స్ టిక్కెట్ ఆశించారు విష్ణువర్దన్ రెడ్డి.అంబర్ పేట్ టికెట్ కోసం నూతి శ్రీకాంత్, మోతె రోహిత్ ప్రయత్నం చేశారు. మహేశ్వరం టికెట్ ఆశించారు పారిజాత నర్సింహారెడ్డి. దేవరకొండ టికెట్ ను ఆశించారు వడ్త్యా రమేష్ నాయక్.
అటు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి టిక్కెట్ కేటాయించడంతో చలమల కృష్ణారెడ్డి మనస్తాపం చెందారు. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు చెల్లమల్ల కృష్ణారెడ్డి వర్గీయులు ఇవాళ మధ్యాహ్నం తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో దామర క్యాంపు కార్యాలయం సమావేశం కానున్నారు చలమల కృష్ణారెడ్డి . కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని చలమలను ఆయన వర్గీయులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
ఇక పరకాల నుంచి ఇలనుగాల వెంకట్రామిరెడ్డి,కొండా మురళి, భోథ్ నుంచి రాథోడ్ బాపురావు, శేరిలింగంపల్లి నుంచి జైపాల్, రఘునాధ్ యాదవ్, కంటోన్మెంట్ నుంచి మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇబ్రహీం పట్నం టికెట్ రాకపోవడంతో తన అనుచరులతో సమావేశమైయ్యారు దండెం రామిరెడ్డి..రెండో రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.