టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్ఎం ప్రమోషన్లపై ఉన్న స్టేను ఎత్తివేసింది. దీంతో బుధవారం రాత్రి జీహెచ్ఎం ప్రమోషన్ల ప్రక్రి యను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రారంభించారు.

 రాత్రి 9గంటలకు మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 కు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ లిస్ట్ (1:3), వెబ్ ఆప్షన్స్ కోసం 1:1 లిస్ట్, ఖాళీల జాబితాను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​ వెబ్ సైట్​లో పెట్టారు. రాత్రి 10 గంటల నుంచి గురువారం 9 గంట ల వరకూ వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఉదయం 6 గంటల నుంచి 9గంటల వరకూ ఎడిట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. గురువారం రాత్రిలోగా  జీహెచ్ఎం ప్రమోషన్లపై ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉంది.