- ఖండించిన తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య (ఫతీ) ఇటీవల విద్యా శాఖ ఇన్‌చార్జి కార్యదర్శి ఎ. శ్రీదేవసేన (ఐఏఎస్)పై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.
శ్రీదేవసేనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని.. ఆమె గౌరవాన్ని తగ్గించే విధంగా ‘ఫతీ’ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ల సంఘం తప్పు పట్టింది. ఈ నిరాధార వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు, సీఎస్ రామకృష్ణారావు, సెక్రటరీ జయేశ్ రంజన్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
