రోస్టర్ వల్ల మాలలకు అన్యాయం : మందాల భాస్కర్

 రోస్టర్ వల్ల మాలలకు అన్యాయం : మందాల భాస్కర్
  • తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్​ మందాల భాస్కర్​

బషీర్​బాగ్, వెలుగు: రోస్టర్​వల్ల మాలలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్​మందాల భాస్కర్​అన్నారు. 40 లక్షల మంది మాలలకు అన్యాయం చేసే జీవో 99ను రద్దు చేయాలని, గ్రూప్–-3 రోస్టర్ పాయింట్22ను వెంటనే 16కు మార్చాలని డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జేఏసీ గౌరవ అధ్యక్షుడు చెరుకు రామచందర్, ఉపాధ్యక్షుడు పీవీ.వీరస్వామి, వర్కింగ్ చైర్మన్ మంత్రి నర్సింహ, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్ తో కలిసి మాట్లాడారు.

షమీమ్​అక్తర్ రిపోర్ట్​ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వర్గీకరణ శాస్త్రీయంగా లేదని, ఎస్సీల్లోని 58 ఉపకులాలకు రిజర్వేషన్లను దూరం చేసిందన్నారు. ఈ విషయమై ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ఎంపీ మల్లు రవి, బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాంకు వినతిపత్రాలు ఇచ్చామని పేర్కొన్నారు.