టీఆఎర్ఎస్ కు తెలంగాణ సంపత్ గుడ్ బై

V6 Velugu Posted on Jun 12, 2021

టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు టిఆర్ఎస్ పార్టీ బాలల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు తెలంగాణ సంపత్. రాజీనామా పత్రాన్ని తెలంగాణ భవన్ కి ఫ్యాక్స్ ద్వారా పంపానన్నారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ .. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి.. టిఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వారికి ఏలాంటి పదవులు, అవకాశాలు ఇవ్వడం లేదని గత జిహెచ్ఎంసి ఎన్నికలలో కొత్తగా వచ్చిన వారికి కార్పొరేటర్ టికెట్లు ఇచ్చారన్నారు. టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు ఆన్యాయం జరుగుతుందని ..ఉద్యమకారుల మీద దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలకు సుప్రీమ్ అప్పజెప్పడం వల్ల నాలాంటి ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణలో కేవలం కుటుంబ వ్యవస్థ నడుస్తుందన్నారు. కొన్ని రోజులుగా తన అనుచర వర్గంతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈటల రాజేందర్ అడుగుజాడల్లో నడుస్తూ వారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ క్రమంలోనే శనివారం టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు సంపత్. 

Tagged etela rajender, resign, TRS party, , Telangana Sampath

Latest Videos

Subscribe Now

More News