అందాల పోటీలు వ్యాపారంగా మారాయి : మంజీర రచయితల సంఘం

అందాల పోటీలు వ్యాపారంగా మారాయి : మంజీర రచయితల సంఘం

బషీర్​బాగ్, వెలుగు: అందాల పోటీలు వ్యాపార పోటీలుగా మారాయని పలువురు రచయితలు అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ‘అందాల పోటీలు -వ్యాపార సంస్కృతి’ అనే అంశంపై సామాజిక సదస్సును మంజీరా రచయితల సంఘం అధ్యక్షుడు రంగాచారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సుకు అతిథులుగా ప్రముఖ కవయిత్రి విమల, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పాలకుల భుజస్కంధాలపై అందాల పోటీలు నిర్వహిస్తున్నారన్నారు.

 రైతులు వేసిన ఆరుతడి పంటలు వర్షానికి తడిసినా, రైతులు ధాన్యం కొనండని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు మూతపడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఇలా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అందాల పోటీల కోసం కోట్లు ఖర్చు పెడుతున్న పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.