సంగారెడ్డికి రూ.4,311 కోట్లు ఇవ్వండి.. ఇన్చార్జి మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామిని  కలిసిన  ఐఐఈసీ  చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌

సంగారెడ్డికి రూ.4,311 కోట్లు ఇవ్వండి.. ఇన్చార్జి మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామిని  కలిసిన  ఐఐఈసీ  చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌

సంగారెడ్డి  టౌన్, వెలుగు :సంగారెడ్డి నియోజకవర్గంలో అభివద్ధి పనులకు సంబంధించిన రూ.4,311 కోట్లు మంజూరు చేశారా చర్యలు తీసుకోవాలని టీజీఐఐసీ  చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌ నిర్మలరెడ్డి ఉమ్మడి మెదక్​ జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని  కోరారు. ఈ మేరకు నిర్మలారెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించిన వినతిపత్రాన్ని మంత్రి వివేక్ కు అందజేశారు. సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో మంజీరా నీరు, పేదలకు ఇండ్ల స్థలాలతో పాటు మహబూబ్‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌ సుందరీకరణ, ఎచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ  పరిధి లోని చెరువుల అభివృద్ధి తదితర పనులు సంబంధిత శాఖల వద్ద వివిధ దశల్లో ఉన్నాయని ఆమె వివరించారు.

మహబూబ్‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌ సుందరీకరణ - రూ. 500 కోట్లు, సంగారెడ్డి మున్సిపాలిటీలోని వార్డుల్లో అభివద్ధి పనులు - రూ.300 కోట్లు, సంగారెడ్డి పట్టణం లో మంచి నీటి సరఫరా అభివద్ధి - 170 కోట్లు, సదాశివపేట పట్టణం లో మంచి నీటి సరఫరా అభివద్ధి - 135 కోట్లు, సదాశివపేట మున్సిపాలిటి లోని వివిధ వార్డుల్లో అభివద్ధి పనుల కోసం వార్డుకు రూ.8 కోట్ల చొప్పున 26 వార్డులకు రూ. 208 కోట్లు నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.