భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేకు వర్షం ముప్పు

భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేకు వర్షం ముప్పు

భారత్, న్యూజిలాండ్ పర్యటనను వరుణుడు వెంటాడుతున్నాడు. రేపు ఓవల్ వేదికగా జరగబోయే న్యూజిలాండ్, భారత్ మూడో వన్డే మ్యాచ్ కు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసినా విలియమ్సన్, లాథమ్ రాణించడంతో టీం ఇండియా ఓడిపోయింది. రెండో వన్డేలో గెలిచి 1,1తో సిరీస్ సమం చేయాలని చూసిన ధవన్ సేనకు నిరాశే ఎదురైంది. రెండో వన్డేకు వర్షం దెబ్బ కొట్టింది. వర్షం కారణంగా మ్యాచ్  ను 29 ఓవర్లకు కుదించినా ఫలితం లేకపోయింది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు ఎంపైర్లు.

అయితే, రేపు జరగబోయే మూడో వన్డేలోనైనా గెలిచి సిరీస్ ని డ్రాగా ముగించాలని చూస్తుంది టీం ఇండియా. ఒకవేళ రేపు ఇండియా ఓడిపోయినా, వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా 1,0తో న్యూజిలాండ్ సిరీస్ గెలుస్తుంది.