
- చిక్కినట్టే చిక్కి పరారైన దొంగ
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ ప్రెస్ క్లబ్లో 7 కంప్యూటర్లు, సీసీటీవీ డివైస్‌లు చోరీకి గురయ్యాయి. ప్రెస్ క్లబ్‌నుంచి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఓ దుండగుడు వీటిని ఒక్కొక్కటిగా దొంగలించాడు. ఆఖరిగా సీసీటీవీ యూనిట్‌ను తీసుకుని వెళ్తుండగా, రాజు అనే విలేకరి అడ్డుకున్నాడు. దీంతో దుండగుడు ఓ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులే తమను వీటిని తీసుకురమ్మంటున్నారని బెదిరింపులకు పాల్పడ్డాడు.
అనంతరం ఆ దొంగ వెంట రాజుకు కూడా స్థానిక పీఎస్‌కు వెళ్లాడు. అక్కడ ఏ పోలీసులు కంప్యూటర్ తీసుకురమ్మన్నారని ప్రశ్నిస్తుండగా, సదరు దొంగ గోడ దూకి పరారయ్యాడు. ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ భాస్కర్ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత నేరస్తుడే దొంగతనానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.