శాంతి ఒప్పందం.. సమయాల సమరం..బర్త్‌డే రోజే డీల్ కావాలన్న ట్రంప్.. అర్ధరాత్రి దాటే వరకు వేచిచూసిన ఇరాన్

శాంతి ఒప్పందం.. సమయాల సమరం..బర్త్‌డే రోజే డీల్ కావాలన్న ట్రంప్.. అర్ధరాత్రి దాటే వరకు వేచిచూసిన ఇరాన్
  • ట్రంప్​కు బర్త్‌‌‌‌డే గిఫ్ట్ ఇవ్వడానికి ఇరాన్ ససేమిరా!

అమెరికా-–ఇరాన్ శాంతి ఒప్పందం వెనుక ఒక ఆసక్తికరమైన ‘సమయాల సమరం’ నడిచింది. జూన్ 14న తన 80వ పుట్టినరోజు కావడం వల్ల, అదే రోజున ఈ చరిత్రాత్మక డీల్‌‌‌‌ను పూర్తి చేయాలని  ట్రంప్ గట్టి పట్టుదలతో వ్యవహరించారు. ఆయన అనుకున్నట్టే అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం నాడే ఒప్పందాన్ని ఖరారు చేశారు. 

అయితే, ట్రంప్‌‌‌‌కు ‘బర్త్‌‌‌‌డే గిఫ్ట్’ ఇవ్వడం ఇరాన్‌‌‌‌కు ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే, కాలమానాల్లోని వ్యత్యాసాన్ని వాడుకుంటూ, టెహ్రాన్‌‌‌‌లో అర్ధరాత్రి దాటి ఒంటి గంట (జూన్ 15) అయ్యేవరకు ఇరాన్ అధికారులు వేచి చూశారు. ఫలితంగా రెండు దేశాలూ తమకు నచ్చిన తేదీల్లోనే ఒప్పందం జరిగిందని ప్రకటించుకున్నాయి. 

అమెరికా, ఇరాన్‌‌‌‌ల మధ్య 7.5 గంటల సమయ వ్యత్యాసం దీనికి కలిసొచ్చింది. దీంతో ఆదివారం నాడే డీల్​ కుదిరిందని  ట్రంప్, సోమవారమే సంతకం చేశామని ఇరాన్ చెప్పుకుంటున్నారు.