వెంకన్న కొండ కిటకిట.. దర్శనానికి 24 గంటలు

వెంకన్న కొండ కిటకిట.. దర్శనానికి 24 గంటలు

తిరుమల శ్రీవారిని సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడంతో తిరుమల శ్రీనివాసుడి దర్శనార్ధం భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో తిరుమలలో కిలో‌మీటర్ల మేర భక్తులు క్యూలైన్స్ లో వేచి ఉన్నారు. 

29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వెయిటింగ్ 

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 29 కంపార్ట్మెంట్ లలో,  నారాయణగిరి గార్డెన్ షెడ్లు భక్తులతో నిండిపోయాయి.  దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం కోసం దాదాపుగా 24 గంటల సమయం వెయిటింగ్ చేస్తున్నారు. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు 3 గంటల సమయం పడుతుంది. క్యూలైన్‌లో భక్తులకు ఆహారం, నీరు అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా  వీఐపీ దర్శన విరామాలు, ఆర్జిత సేవపై సాధారణ యాత్రికుల దర్శన వేళలను తగ్గించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులు తమకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహించే క్రమంలో గురువారం మధ్యాహ్నం నుండి స్వామి వారికి పూలంగి సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తొంది. స్వామి వారిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి, అరుదైన సుంగంధ పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తారు అర్చకులు దీనినే పూలంగి సేవ అని కూడా పిలుస్తారు. ఎటువంటి ఆభరణాలు లేకుండా పూలతో అలంకరించిన స్వామి వారు భక్తులను మంత్రముగ్ధులను చేస్తారు.