
తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. గత నాలుగు రోజులుగా రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. సమ్మర్ హాలిడేస్ తో పాటు.. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్వనానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు.సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది.
తిరుమల కొండ ఎక్కడ చూసినా భక్తులతో కిక్కిరిసిపోయింది. SSD టికెట్లు లేకుండా దర్శనానికి వచ్చిన భక్తులు అన్ని కంపార్ట్ మెంట్లలో నిండిపోయి, శిలాతోరణం వరకు లైన్లలో వేచి ఉన్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ అనని చర్యలు తీసుకుంటుంది. క్యూ లైన్లు, కంపార్ట్ మెంట్లలో ఉండే భక్తులకు నీళ్లు, అన్నప్రాసాదాలు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టింది. మరోవైపు కొండపై గదుల కోసం రద్దీ కొనసాగుతుంది. తిరుమల శ్రీవారిని శనివారం ( మే 27) 88,604 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.53 కోట్లు హుండీ ఆదాయం లభించింది. 51,251 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది.
ప్రస్తుతం తిరుమలలో దర్శనానికి 70 నుంచి 80 వేల వరకు భక్తులు ఉన్నారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే వేలాది మంది సామాన్య భక్తులకు.. అంతరాయం కలుగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలో రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు, వీఐపీలు సహకరించాలని టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు.