శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: ఏ రోజు ఏ వాహనం మీద దర్శనం ఇస్తారంటే

 శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: ఏ రోజు ఏ వాహనం మీద దర్శనం ఇస్తారంటే

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.. బ్రహ్మోత్సవాలకు 14 వ తేది అంకురార్పణ జరగనుంది.  శ్రీవారి  నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 24 న దసరా సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.. ఇక ఈ నెల 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవలు 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది.

ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ఏ రోజు ఏ వాహనం మీద దర్శనం ఇస్తారంటే?

  • ఈ నెల 14న అంకురార్పణం,
  •  15న ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి పెద్దశేష వాహనం,
  •  16న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం,
  •  17న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం,
  • 18న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం,
  •  19న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం,

ALSO READ :తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ

  •  20న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం పుష్పకవిమానం, రాత్రి గజ వాహనం,
  •  21న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం,
  • 22న ఉదయం స్వర్ణ రథం, రాత్రి అశ్వవాహనం సేవ నిర్వహిస్తారు.
  • 23న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది.