తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది.   క్యూ భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.  టోకెన్లు లేని భక్తులు  5 గంటల్లోనే  శ్రీవారి దర్శనం  చేసుకోవచ్చు.  ఇక కంపార్ట్ మెంట్లలో భక్తుల రద్దీ అంతంతమాత్రంగానే ఉంది.  పెరటాసి మాసం.. పైగా మూడో శనివారం అయినప్పటికీ భక్తుల రద్దీ తగ్గిపోవడం గమనార్హం.  ఇదిలా ఉంటే.. తిరుమలలో శ్రీవారిని శనివారం 72,309 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,296 మంది భక్తులు  తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.50 కోట్లుగా తేలింది. 

మరోవైపు 2023 అక్టోబర్ 9వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ భేటీలో పలు కీలక అంశాలతో పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలపైనా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు 14వ తేదీన అంకురార్పణ జరుగుతుంది. 15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.