చదువుతోనే  భ‌‌‌‌విష్యత్కు బంగారు బాట‌‌‌‌ : కలెక్టర్ రిజ్వాన్ భాషా

చదువుతోనే  భ‌‌‌‌విష్యత్కు బంగారు బాట‌‌‌‌ : కలెక్టర్ రిజ్వాన్ భాషా
  • టెన్త్ స్టూడెంట్లకు విజయోస్తు బుక్స్ అందించిన కలెక్టర్ రిజ్వాన్ భాషా

జనగామ, వెలుగు: చదువుతోనే భవిష్యత్​కు బంగారు బాట పడుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఇష్టపడి చదవి ఉత్తమ ఫలితాలు సాధించాలని స్టూడెంట్స్​కు ఆయన పిలుపునిచ్చారు. జనగామ హైస్కూల్​లో  పదో తరగతి స్టూడెంట్స్​కు విజయోస్తు 2.0 స్టడీ మెటీరియల్ అందించి మాట్లాడారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు నిర్ధిష్టమైన టైమ్‌‌‌‌టేబుల్ ను రూపొందించుకొని, క్రమశిక్షణతో అధ్యయనం చేయాలని సూచించారు.

పదో తరగతి స్టూడెంట్స్​కు కీలకమైన మైలురాయి అని తెలిపారు. ధృడ‌‌‌‌మైన సంక‌‌‌‌ల్పాన్ని పెట్టుకొని ల‌‌‌‌క్ష్యాన్ని సాధించేందుకు నిరంత‌‌‌‌రం కృషి చేయాల‌‌‌‌ని సూచించారు. సెల్ ఫోన్లు, టీవీలు ఏకాగ్రతను దెబ్బతీస్తాయని, వాటికి దూరంగా ఉండాలన్నారు. క‌‌‌‌ఠిన‌‌‌‌మైన స‌‌‌‌బ్జెక్టుల‌‌‌‌ను అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. మంచి మార్కులు సాధించాలంటే చేతిరాత మంచిగా ఉండేలా చూడాలన్నారు. పరీక్షలపై భయం లేకుండా ధైర్యంగా ఉంటే అనుకున్న ల‌‌‌‌క్ష్యాన్ని సాధిస్తారని అన్నారు.

పౌష్టికాహారం తీసుకోవ‌‌‌‌డంలో పాటు మంచిగా నిద్ర పోవాల‌‌‌‌ని, కొద్దిపాటి వ్యాయామం చేయ‌‌‌‌డం వ‌‌‌‌ల్ల మీ యొక్క ఏకాగ‌‌‌‌త్ర పెరుగుతుంద‌‌‌‌ని సూచించారు. ప్రతి ఒక్కరూ మంచి మార్కులు సాధించి, ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. విజ‌‌‌‌యోస్తు బుక్స్​తో పాటు స్టూడెంట్స్​కు పెన్నులను అందించారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీ‌‌‌‌నివాస్‌‌‌‌, హెడ్​మాస్టర్ న‌‌‌‌ర్సింహ‌‌‌‌రెడ్డి, జీసీడీవో గౌసియా బేగం, టీచర్లు పాల్గొన్నారు.