నారాయణపేట్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు ఎన్నికను వాయిదా వేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవ్ ఆత్మహత్యతో ఎన్నికను
రద్దు చేస్తున్నట్టు తెలిపింది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనుండగా.. ఫిబ్రవరి 9న రాత్రి మక్తల్ మున్సిపాలిటీలో 6 వార్డ్ బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. మహదేవ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రత్యర్థుల వేధింపులతోనే మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. ఎన్నికలకు ఒక్క రోజు ముందే అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో వైపు ఎరుకలి మహాదేవప్ ఆత్మహత్య నిరసనగా హైదరాబాద్ డీజీపీ కార్యాలయ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో లక్డీకపూల్ లోని డీజీపీ కార్యాలయం ముందు భారీగా పోలీసులు భారీగా మోహరించారు.
