ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలకు ర్యాండమైజేషన్ పూర్తి : కలెక్టర్ స్నేహ శబరీశ్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలకు ర్యాండమైజేషన్ పూర్తి : కలెక్టర్ స్నేహ శబరీశ్

హనుమకొండ/ జనగామ అర్బన్/ కాశీబుగ్గ, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ఎన్నికల సిబ్బందికి సంబంధించి ర్యాండమైజేషన్​ పూర్తయ్యింది. హనుమకొండ జిల్లా పరకాలలో ఎన్నికల పరిశీలకులు కె.శివ కుమార్​ నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ స్నేహ శబరీశ్ సమక్షంలో సోమవారం మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. పరకాల మున్సిపాలిటీలోని 22వార్డులకు 44 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 44 మంది పోలింగ్ అధికారులతోపాటు, తొమ్మిది మంది ని అదనంగా కేటాయించారు.

ఓపీవోలు 132 మంది, అదనంగా ఇరవై శాతం కలిపి 158 మంది, మరికొంతమంది రిజర్వు సిబ్బందిని కేటాయించారు. జనగామ కలెక్టరేట్​లో నిర్వహించిన ర్యాండమైజేన్​ ప్రక్రియ జనరల్​ అబ్జర్వర్​ నర్సింహారెడ్డి, జిల్లా ఎన్నికల ఆఫీసర్, కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​ సమక్షంలో కొనసాగింది. జనగామ మున్సిపాలిటీలో 30 వార్దులకు 66 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 80 మంది పీవోలు, 80 ఏపీవోలు, 240 ఓపీవోలు, స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులకు సంబంధించి 36 పోలింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేశారు.

44 మంది పీవో, 44 ఏపీవో, 132 ఓపీవోలను  ర్యాండమైజేషన్ ద్వారా నియమించారు. జనగామ మున్సిపాలిటీకి 26 పోలింగ్ లొకేషన్లకు 28 మంది, ఘనపూర్ కి 7 లొకేషన్లకు 9 మంది మైక్రో అబ్సర్వర్లను కేటాయించారు. వరంగల్​ కలెక్టరేట్​లో నిర్వహించిన ర్యాండమైజేషన్​ ప్రక్రియ జిల్లా ఎన్నిల ఆఫీసర్, కలెక్టర్​ సత్యశారద, జనరల్​ అబ్జర్వర్​ కిల్లు శివకుమార్​ నాయకుడు సమక్షంలో జరిగింది.

నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించేందుకు మొత్తం 80 మంది ప్రిసైడింగ్ అధికారులు, 80 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 240 మంది ఇతర పోలింగ్ అధికారులను కేటాయించారు. 17 మంది సూక్ష్మ పరిశీలకులను, రిజర్వ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.