Good Health : షుగర్ ఉన్నోళ్లు.. షుగర్ రాకుండా జాగ్రత్త పడేవాళ్లు.. అందరూ ఈ నాలుగు పరీక్షలు చేయించుకుంటే బెటర్ ..!

Good Health : షుగర్ ఉన్నోళ్లు.. షుగర్ రాకుండా జాగ్రత్త పడేవాళ్లు.. అందరూ ఈ నాలుగు పరీక్షలు చేయించుకుంటే బెటర్ ..!

డయాబెటిస్ లేదా మధుమేహం(షుగర్) అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్ వస్తే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువకాలం పాటు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటాయి. మాములుగా మన శరీరంలో షుగర్ లెవెల్స్ ఓ సాధారణ సాయికి ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న తప్పనిసరి డాక్టర్లను సంప్రదించాలి.  డయాబెటిస్ వస్తే మన ఆహార అలవాట్లతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం 1990లో 18 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న  7% మందికి డయాబెటిస్ ఉంటే, 2022 నాటికి 14%కి పెరిగింది. అంటే దీని అర్థం 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 83 కోట్ల మంది ప్రజలు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు.

డయాబెటిస్ అనేది సాధారణంగా కనిపించే వ్యాధులలో ఒకటి. ఈ వ్యాధిని ముందుగా తెలుసుకొని అలాగే సరైన ఆహారంతో పాటు వైద్యం  తీసుకోవడం చాలా కీలకం. డాక్టర్లు సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయి తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు చెబుతుంటారు. వీటి గురించి కొందరికి పూర్తిగాతెలియదు. డయాబెటిస్‌ ఉందా లేదా తెలుసుకోవడానికి చేసే టెస్టుల గురించి మీకోసం.... 

డయాబెటిస్ టెస్టులు:
A1C టెస్ట్: ఈ టెస్ట్ ని గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ టెస్ట్ అని కూడా అంటారు. దీని ద్వారా  గత 2 నుంచి 3 నెలల్లో మీ రక్తంలో సగటున చక్కెర స్థాయి ఎంత ఉందొ తెలుస్తుంది. ప్రతిరోజు చేసే గ్లూకోజ్ టెస్టుల్ల కాకుండా మీ గ్లూకోజ్ కంట్రోల్ గురించి ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఈ టెస్టుల్లో చక్కెర  శాతం ఎక్కువ ఉంటే రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్లో లేదని అర్థం. డయాబెటిస్‌ ఉందా లేదా తేల్చడంలో  ఇంకా  ట్రీట్మెంట్ ఎంత అవసరమో చెప్పడానికి ఇదొక నమ్మకైన పద్ధతి.

ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్: ఈ టెస్ట్  ఏదైనా ఆహారం లేదా నీళ్లు/ పానీయాలు తీసుకోకుండా కనీసం ఎనిమిది గంటలపాటు ఉపవాసం(fasting) ఉన్న తర్వాత చేస్తారు. సాధారణంగా చూస్తే  రాత్రి తిన్న తరువాత నుండి ఉదయం ఖాళీ కడుపుతో  ఉన్నప్పుడు చేస్తారు. ఈ టెస్ట్ ద్వారా రక్తంలో గ్లూకోజ్ ప్రైమరీ లెవల్ కొలుస్తారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు సాధారణ లెవల్ కంటే ఎక్కువగా ఉంటే మీకు డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్‌ ఉండొచ్చు. అలాగే డాక్టర్లు ఏదైనా ఆహార అలవాట్ల మార్పులు లేదా ట్రీట్మెంట్ ఇవ్వడంలో సహాయపడుతుంది.

ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (Glucose Tolerance Test): ఈ టెస్ట్ మీ శరీరం చక్కెరను ఎలా ప్రాసెస్ చేస్తుందో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. గర్భిణీ స్త్రీలలో గర్భధారణ మధుమేహం (Gestational Diabetes)ను గుర్తించడానికి ఈ టెస్ట్ చాలా కామన్. ఉపవాసం తర్వాత ఎక్కువ గ్లూకోజ్ ఉన్న ఒక పానీయం తాగి ఆ తర్వాత కొంత సమయానికి రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేస్తారు.

రాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ (Random Blood Sugar Test): ఈ టెస్ట్ ఏ టైంలోనైన అంటే మీరు భోజనం చేసినా చేయకపోయినా చేయవచ్చు. మీరు ఎక్కువగా మూత్రవిసర్జన, ఎక్కువగా దాహం లేదా అలసటలాంటి డయాబెటిస్ లక్షణాలు అనిపిస్తే త్వరగా రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవడానికి ఈ టెస్ట్ సహాయపడుతుంది. ఈ టెస్ట్ లో రీడింగ్ చాలా ఎక్కువగా ఉంటే సాధారణ డయాబెటిస్‌ అని  సూచిస్తుంది. అయితే దానిని తేల్చాలంటే  మరిన్ని ఇతర టెస్టుల  అవసరం కావచ్చు.