దుబ్బాక భయంతోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు

దుబ్బాక భయంతోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు

 యాక్షన్ కు రియాక్షన్ కూడా వస్తోందని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి  సంస్కారహీనంగా మాట్లాడటం తెలంగాణ సమాజానికి సిగ్గుచేటన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేను.. ‌‌దుబ్బాక ఎమ్మెల్యే కూడా తిట్టగలడని తెలిపారు. దుబ్బాక భయంతోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలకు బయలు దేరాడన్నారు రఘునందనరావు. బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందనరావు, రాజాసింగ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా మాట్లాడారు.
తమ పీఠాలు కదులుతున్నాయని సీఎం కేసీఆర్ కు స్పష్టంగా అర్థమవుతోందన్నారు ఎమ్మెల్యే రఘునందన రావు. ఇద్దరు సీఎంలు ముందుకొస్తే నీటి పంపాలకు తేల్చటానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రం నివేదికలు కోరితే రాష్ట్ర ప్రభుత్వం సాకులు చెప్తోందని విమర్శించారు. రైతుబంధు, రైతు వేదికలు, వైకుంఠధామాలను ప్రతిపక్షాలు వ్యతిరేకించకున్నా..సీఎం కేసీఆర్ కు ఉలుకెందుకని ప్రశ్నినించారు. ధాన్యం సేకరణలో పంజాబ్ మెదటి స్థానంలో ఉంటే.. తెలంగాణ ఉందని కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తున్నాడన్నారు. ధాన్యం కొనుగొలులో సీఎం కేసీఆర్ కమిషన్ ఏజెంట్  మాత్రమేనన్నారు.

రామాయణం లో కుంబకర్నుడి తరహాలో సీఎం కేసీఆర్  తయారయ్యాడన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఆయన ఎప్పుడు బయటకు వస్తడో..ఫాం హౌజ్ లో పండుకుంటడో తెలియదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మంచిదే..కానీ బీజేపీ ని టార్గెట్ చేశారని ఆరోపించారు. తెలంగాణ లో మేమే అభివృద్ధి చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారన్నారు. కేంద్రం సాయం లేదు అన్నట్లు మాట్లాడారు. రాష్ట్రంలో నియోజకవర్గాలు అంటే సిద్దిపేట.. గజ్వేల్ అన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్యాంపు ఆఫీసు కు నా నియోజకవర్గం నాలుగు కిలోమీటర్లు కూడా లేదన్న రాజా సింగ్..ఇప్పటి వరకు నిధులు రాలేదన్నారు.