కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె వాయిదా

కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె వాయిదా

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.. ఫిబ్రవరి 23, 24వ తేదీల్లో తలపెట్టిన సార్వత్రిక సమ్మెను కార్మిక సంఘాలు వాయిదా వేసుకున్నాయి.  కరోనా థర్డ్ వేవ్ కేసులకు తోడు.. ఐదు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా.. సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఫిబ్రవరి 23, 24 తేదీలలో జరగవలసిన సార్వత్రిక సమ్మెను మార్చి 28, 29 తేదీలకు మార్పు చేసినట్లు స్పష్టం చేశాయి. 
దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె విజయవంతానికి కట్టుబడి పోరాటానికి అన్ని వర్గాలను సన్నద్ధం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని రైతుల కిచ్చిన హమిలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ  రైతు సంఘాల ఆధ్వర్యంలో జనవరి 31వ తేదీన వి ద్రోహ దినంగా పాటిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. 

 

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత ఆష్లే బార్టీ

పెగాసస్ పై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం

ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు రీఓపెన్!