ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత ఆష్లే బార్టీ

V6 Velugu Posted on Jan 29, 2022

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియాకే చెందిన ఆష్లే బార్టీ టైటిల్ సొంతం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్ పోరులో అమెరికాకు చెందిన డానియెలీ రోజ్ కొలిన్స్ పై వరుసగా 6 - 3, 7 - 6 పాయింట్ల తేడాతో గెలుపొంది గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం చేసుకుంది. తొలి సెంట్ లో సునాయసంగా గెలిచిన ఆష్లే బార్టీ రెండో సెట్ లో 1 - 5 తేడాతో వెనుకబడిపోయింది. ఓటమి తప్పదనుకుంటున్న దశలో రోజ్ కొలిన్స్ చేసిన పొరపాట్లను ఆష్లే బార్టీ చక్కగా ఉపయోగించుకుని మ్యాచ్ ను లాగేసుకుంది.   
గ్రాండ్ స్లామ్ టోర్నీలో సంచలన విజయాలు సాధించిన డానియెల్ రోజీ కొలిన్స్ తొలిసారి ఫైనల్ కు చేరిన ఒత్తిడిని జయించలేకపోయింది.  రెండో సెట్ లో గట్టిపోటీ ఇచ్చినప్పటికీ అదే ఊపును కొనసాగించలేక చేతులెత్తేసింది. ఆష్లే బార్టీ అవకాశాన్ని అందిపుచ్చుకుని రోజ్ కొలిన్స్ ను చిత్తు చేసి స్వదేశంలో టైటిల్ సాధించాలన్న తన కల నెరవేర్చుకుంది.  2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్ టైటిళ్లు సాధించిన ఆష్లే బార్టీ స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ను తొలిసారిగా కైవసం చేసుకుని ఆ లోటును తీర్చేసుకుంది. 

 

 

 

ఇవి కూడా చదవండి

పెగాసస్ పై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం

ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు రీఓపెన్!

ఫ్రీజర్‌‌‌‌లో ఫుడ్‌‌ని స్టోర్‌‌‌‌ చేసేందుకు టిప్స్

Tagged win, match, title, Ashleigh barty, Final, women singles, Danielle collins, Autralian Open

Latest Videos

Subscribe Now

More News