కల్వర్టు తెగిపోవడంతో మూడూర్లకు రాకపోకలు బంద్ 

కల్వర్టు తెగిపోవడంతో మూడూర్లకు రాకపోకలు బంద్ 

మెదక్ ,  వెలుగు: భారీ వర్షానికి వాగుకు వరద వచ్చి కల్వర్టు కొట్టుకు పోవడంతో మెదక్ జిల్లా, శివ్వంపేట మండలంలో మూడు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్నవర్షాలకు శివ్వంపేట మండలం, చెన్నాపూర్​ గ్రామ పరిధిలోని వాగుకు భారీ వరద వచ్చింది. వరద తాకిడికి మండలంలోని సికింద్లాపూర్, గోమారం, పెద్ద గొట్టిముక్ల గ్రామాలకు వెళ్లే దారిమీద చెన్నాపూర్​ శివారులో ఉన్న కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో ఆయా గ్రామాలకు  రాకపోకలు బంద్ అయ్యాయి. ఆయా ఊర్ల ప్రజలు శివ్వంపేట నుండి చెంది గ్రామం మీదుగా తిరిగి వెళ్తున్నారు.  

కొట్టుకు పోయిన 24 గోర్లు 

చెరువు అలుగు ఉదృతంగా పారుతుండటంతో 24 గోర్లు కొట్టుకుపోయాయి. ఈ సంఘటన మంగళవారం శివ్వంపేట మండలం నవాపేటలో జరిగింది. రాములు తండాకు చెందిన శంకర్, రాజు, తౌర్య, మోహన్, లచ్చిరెడ్డిగూడెంకు చెందిన  యాదయ్య, రవి, రాజు రోజు మాదిరిగానే గొర్రెల మేపేందుకు అడవికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో దారిలో ఉన్న సాంబయ్య చెరువు అలుగు పారుతుండటంతో అలుగు దాటే క్రమంలో 24 గొర్లు కొట్టుకుపోయాయని బాధితులు తెలిపారు. దాదాపు 2.50 లక్షల నష్టం జరిగిందని ఆవేదదన వ్యక్తం చేశారు.