-case-has-been-investigated-by-the-police_B6lMKrSRUE.jpg)
సంగారెడ్డి: ట్రాన్స్జెండర్ బోనాల దీపిక అలియాస్ తిలక్ (26) హత్యా కేసును పోలీసులు చేధించారు. సొంత ఫ్రెండే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ట్రాన్స్జెండర్ బోనాల దీపిక తన ఫ్రెండ్ సాయి హర్షతో రిలేషన్ లో ఉంది. ఈ నెల 21న దీపిక, సాయి హర్షతో పాటు మరికొంత మందితో కలిసి మారేపల్లిలో బోనాల ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే వారు మద్యం సేవించారు. బోనాల ఉత్సవాల అనంతరం దీపిక, హర్ష కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కారు కొండాపూర్ చేరుకోగానే కోపొద్రిక్తుడైన హర్ష... దీపికపై దాడి చేసి చంపేశాడు. అనంతరం దీపిక అమ్మనాన్నలకు ఫోన్ చేసిన సాయి హర్ష... దీపికకు ఫిట్స్ వచ్చాయని, లింగంపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నట్లు సమాచారం అందించాడు. హాస్పిటల్ కు చేరుకున్న దీపిక కుటుంబ సభ్యులకు ఆమె చనిపోయిందని తెలయడంతో షాకయ్యారు.
అయితే దీపిక తల్లిదండ్రులు హాస్పిటల్ వచ్చే సమయానికే సాయి హర్ష అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలోనే అతడు తన కారుతో పాటు ఇతర వస్తువులను అక్కడే వదిలేసి వెళ్లాడు. అనుమానం రావడంతో దీపిక అన్న సురేశ్ తన చెల్లెలి చావుకు సాయి హర్షే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి... దీపికా ఫ్రెండ్ సాయి హర్షే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గతంలో దీపికా తనకి రూ.లక్షన్నర అప్పుగా ఇచ్చిందని... తిరిగి ఇవ్వాలని వేధించడం వల్లే తాను ఈ హత్యకు పాల్పడినట్లు నిందితుడు సాయి హర్ష పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. అంతేకాకుండా దీపికా ఈ మధ్య తనను ఏమాత్రం పట్టించుకోవడంలేదని నిందితుడు కక్ష పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.