కొండా లక్ష్మణ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం : సాయిబాబా గౌడ్

కొండా లక్ష్మణ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం : సాయిబాబా గౌడ్

ఆర్మూర్, వెలుగు: కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామని ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆదివారం ఆర్మూర్‌లో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా టౌన్‌లోని లక్ష్మణ్ బాపూజీ చౌరస్తా వద్ద విగ్రహానికి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాక్ మోహన్ దాస్, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్, పద్మశాలి సంఘం నియోజకవర్గ ఇన్​చార్జి దాసరి సునీల్, మండల అధ్యక్షుడు బొడ్డు గంగాధర్ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం మంత్రి పదవిని వదిలి తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. 

చేనేత సహకార సంఘాన్ని స్థాపించిన వ్యవస్థాపకుడు, రాజకీయ కుట్రలతో సీఎం పదవి కోల్పోయిన వ్యక్తి బాపూజీ అని తెలిపారు. తెలంగాణ జాతిపితగా పేరుపొందిన బాపూజీ ఆశయాలు, సిద్ధాంతాలను భవిష్యత్​ తరాలకు తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు. సర్వ సమాజ్ ప్రతినిధి కొక్కుల విద్యాసాగర్, మాజీ కౌన్సిలర్ ఖాందేశ్ సంగీత శ్రీనివాస్, బత్తుల భాస్కర్, కట్కం నరేంద్ర, బండి అనంతరావు, చిట్ల యగ్నేశ్, రుద్ర రాజేశ్వర్, సైబ్ సుధాకర్, వేముల ప్రకాశ్, బండి రాజు, గుద్దేటి రమేశ్, చౌకె లింగం, అందె నాగేశ్వర్ రావు, అంబల్ల శ్రీనివాస్, తిరుపతి, మర్రి రాజేశ్వర్, ఆడెపు ప్రభాకర్, వివేకానంద్, గణేశ్, నూకల శేఖర్, రమణ, నరేంద్ర పాల్గొన్నారు.