వరి వేయొద్దనే అధికారం కేసీఆర్ కు లేదు

వరి వేయొద్దనే అధికారం కేసీఆర్ కు లేదు

కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. వరి వేయొద్దనే అధికారం కేసీఆర్ కు లేదన్నారు. వడ్లు కొనడం చేతగాకే  ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.రైతు ఆవేదన యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముచ్చర్లలో.. రాగుల దేవయ్య కుటుంబాన్ని పరామర్శించారు షర్మిల.  దేవయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అప్పులు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 25లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం

తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ
వింత వైరస్.. తైవాన్ జామ రైతులకు నష్టాలు
రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు