శ్రీవారి సర్వదర్శనానికి అందరికీ అనుమతి

V6 Velugu Posted on Sep 19, 2021

తిరుమల: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై శ్రీవారి సర్వదర్శనానికి అందరికీ అనుమతించాలని దేవస్థానం నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 2 వేల నుండి 8 వేలకు పెంచుతూ టిటిడి ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఉదయం నుండి భక్తులకు సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంచింది టిటిడి. 
తిరుపతి శ్రీనివాసం వసతి సముదాయం టిక్కెట్ల కౌంటర్లు వద్ద టోకెన్లు జారీ చేస్తున్నారు. ఆధార్ కార్డు కలిగిన ప్రతి భక్తుడి కి ఈ అవకాశాన్ని కల్పించారు. త్వరలోనే ఆన్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉంచుతామని టీటీడీ ప్రకటించింది. 
 

Tagged tirumala, Tirupati, Amaravati, Chittoor District, Srivari darshan, Tirumala darshan, , ap updates, ttd sarva darshan, ttd updates

Latest Videos

Subscribe Now

More News