మిర్చీ బజ్జీల్లో గంజాయి అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్​

మిర్చీ బజ్జీల్లో గంజాయి అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్​
  • 2.5 కిలోల సరుకు పట్టివేత

కోనరావుపేట, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని నిజామాబాద్​ గ్రామంలో గంజాయి కలిపిన మిర్చీ  బజ్జీలు అమ్ముతున్న వ్యక్తితో పాటు గంజాయి సాగు చేస్తున్న మరో వ్యక్తిని సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ కిరణ్ కుమార్ తెలిపారు. కోనరావుపేట పోలీస్ స్టేషన్ లో ఆయన వివరాలు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన రిజ్వాన్, విజయ్ అనే వ్యక్తులు నిజామాబాద్ గ్రామానికి ఉపాధి కోసం వచ్చారు. రిజ్వాన్​ మిర్చీ బజ్జీలు తయారు చేస్తూ వాటిలో గంజాయిని కలిపి అమ్మేవాడు. రిజ్వాన్​ తన ఇంటి ముందు ఓ ఇంట్లో  కిరాయికి ఉంటున్న విజయ్ వద్ద  గంజాయి ఆకులు కొనేవాడు. విజయ్ తను ఉంటున్న ఇంటి పెరట్లో వాటిని పెంచేవాడు. పక్కా సమాచారంతో దాడి చేసి వారి వద్ద గంజాయి మొక్కలను, 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.