
అతి త్వరలో ‘భీమ్లానాయక్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’గా వచ్చే ప్లాన్స్‌లో ఉన్నారు. మొదటిసారి పవన్ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేస్తుండటంతో ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. అయితే అందరూ అనుకున్నట్టు ఇది పూర్తిగా పాత కాలం నాటి కథ కాదట. కొంత ఈ కాలంలోనూ నడుస్తుందట. ఈ విషయాన్ని ఆ చిత్ర హీరోయిన్ నిధి అగర్వాల్ రీసెంట్‌గా రివీల్ చేసింది. తను చెప్పినదాని ప్రకారం ఈ సినిమా రెండు వేర్వేరు కాలాల మధ్య సాగుతుంది. ఒకటి ముఘలుల కాలం. ఈ పార్ట్‌లో పవన్ బందిపోటుగా కనిపిస్తారు. రెండోది ఇప్పటి కాలం. ఇందులో ఏ లుక్‌లో ఉంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రెండు వేరియేషన్స్ మాత్రం అదిరిపోతాయంటోంది నిధి. అప్పటి కాలానికి, ఇప్పటి కాలానికి మధ్య సంబంధాన్ని లింక్ చేస్తూ సాగే కథ ఇంప్రెస్ చేస్తుందంటూ ఊరిస్తోంది. ఆల్రెడీ ఫస్టాఫ్ షూటింగ్ కంప్లీటయ్యింది. నెక్స్ట్ షెడ్యూల్‌ను రాజస్థాన్‌లో ప్లాన్ చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అర్జున్ రామ్‌పాల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆడియో రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ సంస్థ టిప్స్ దక్కించుకుంది. ఏప్రిల్ 29న రిలీజ్ చేయనున్నట్టు గతంలో అనౌన్స్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వీలవుతుందో లేదో చూడాలి. మరోవైపు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘భవధీయుడు భగత్ సింగ్’ చిత్రం చేస్తున్నారు పవన్. త్వరలో సెట్స్‌కి వెళ్లనున్న ఈ మూవీలో విలన్‌గా విజయ్ సేతుపతిని తీసుకున్నా రనే టాక్ వినిపిస్తోంది.