వీడియో : మేఘాలను చీల్చుకుంటూ వచ్చి.. 9 సెకన్లలో మాయం : గ్రహాంతర వాసులేనా..?

వీడియో : మేఘాలను చీల్చుకుంటూ వచ్చి.. 9 సెకన్లలో మాయం : గ్రహాంతర వాసులేనా..?

ఆకాళంలో ఏం జరుగుతుంది.. ఇతర గ్రహాల్లో ఎవరైనా ఉన్నారా.. భూమిపైనే కాకుండా అదృశ్య శక్తులు ఏమైనా ఉన్నాయా.. ఇప్పుడు ఈ అంశం మరోసారి చర్చనీయాంశం అవుతుంది. ఏలియన్స్ ఉన్నారని.. వాళ్లు ఫ్లయింగ్ సాసర్ లాంటి వాహనాల్లో భూమిపైకి వస్తున్నారనే ప్రచారం ఎన్నో ఏళ్లుగా ఉంది. ఎన్నో హాలివుడ్ సినిమాల్లోనూ చూశాం.. ఇప్పుడు రష్యాలో ఆకాశంలో కనిపించిన అద్భుతం.. మరోసారి చర్చనీయాంశం అయ్యింది. 

రష్యాకు చెందిన RT ఛానెల్ తన అఫిషియల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో కనిపించిన దృశ్చం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సముద్రం ఎగసిపడుతుంది. పోటుపై ఉంది. ఇదే సమయంలో ఆకాశం మేఘావృతం అయ్యి.. మెరుపులు వస్తున్నాయి. వర్షం పడే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో.. మెరుపులు.. మేఘాల మధ్య నుంచి ఓ వస్తువు రాకెట్ వేగంతో వచ్చి.. కేవలం తొమ్మిది అంటే 9 సెకన్లలో మాయం అవుతుంది. ఇది సరిగ్గా ఫ్లయింగ్ సాసర్ ఆకారంలో ఉండటం విశేషం. రాకెట్ అయినా.. విమానం అయినా.. వెంటనే మాయం కాదు.. కొద్దిదూరం స్పష్టంగా కనిపిస్తుంది. 

ఈ వీడియో 19 సెకన్లు ఉండగా.. కేవలం తొమ్మిది సెకన్లు మాత్రమే అదృశ్య వాహనం కనిపించటం విశేషం. వీడియోలో కొన్ని మాటలు కూడా వినిపిస్తాయి.. మీరు చూశారా.. ఎవరైనా దాన్ని చూశారా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆ ఎగిరే వస్తువు రాకెట్ వేగంతో దూసుకెళ్లటం కనిపిస్తుంది. ఓ వ్యక్తి తీసిన వీడియోలో ఇది రికార్డ్ కావటం.. అది కూడా ఓ ప్రముఖ ఛానెల్ సోషల్ మీడియాలో పోస్టు కావటంతో.. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

 

కొన్ని రోజుల క్రితం.. అమెరికా టెక్సాస్ మీదుగా వెళుతున్న విమానంలోని ప్రయాణికులు సైతం.. మాకు ఓ ఎగిరే వస్తువు కనిపించింది అని చెప్పటం విశేషం. వరసగా వస్తున్న ఇలాంటి వార్తలు శాస్త్రవేత్తల్లో సైతం ఆసక్తి రేపుతున్నాయి.