భారత సాయుధ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువతీ యువకులకు ఇదో సువర్ణావకాశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్ డీఏ), నావల్ అకాడమీ (ఎన్ఏ)ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 12వ తరగతి/ ఇంటర్మీడియట్) అర్హత ఉన్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. శిక్షణా కాలంలోనే ఆకర్షణీయమైన స్టైఫండ్ కూడా చెల్లిస్తారు.
కోర్సు/అకాడమీ: ఎన్డీఏ 158వ కోర్సు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్), 120వ ఐఎన్ఏసీ (10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్).
మొత్తం ఖాళీలు: 394 (పురుషులకు 370 + మహిళలకు 24).
విభాగాల వారీగా ఖాళీల వివరాలు
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) – 158వ కోర్సు:
ఆర్మీ 208 (పురుషులు: 198, మహిళలు: 10).
నేవీ (ఆల్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) 42 (పురుషులు: 37, మహిళలు: 5).
ఎయిర్ ఫోర్స్ (ఫ్లయింగ్)92 (పురుషులు: 90, మహిళలు: 2).
ఎయిర్ ఫోర్స్ (గ్రౌండ్ డ్యూటీస్ – టెక్నికల్)18 (పురుషులు: 16, మహిళలు: 2).
ఎయిర్ ఫోర్స్ (గ్రౌండ్ డ్యూటీస్ – నాన్ టెక్నికల్) 13 (పురుషులు: 10, మహిళలు: 3)
నావల్ అకాడమీ (ఐఎన్ఏసీ) – 120వ కోర్సు
10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్ 24 (పురుషులు: 21, మహిళలు: 3)
ఎలిజిబిలిటీ
ఆర్మీ వింగ్ (ఎన్డీఏ): గుర్తింపు పొందిన బోర్డు నుంచి సీనియర్ సెకండరీ పరీక్ష (10+2 విధానం) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
నేవీ, ఎయిర్ ఫోర్స్ వింగ్స్ (ఎన్డీఏ & నావల్ అకాడమీ): గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండటం తప్పనిసరి.
వైవాహిక స్థితి: అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. శిక్షణ పూర్తయ్యే వరకు వివాహం చేసుకోబోమని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ శిక్షణా సమయంలో వివాహం చేసుకుంటే అకాడమీ నుంచి తొలగిస్తారు. అంతేకాకుండాఅప్పటివరకు శిక్షణ కోసం ప్రభుత్వం పెట్టిన ఖర్చు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
వయోపరిమితి: అభ్యర్థులు 2008, జనవరి 1 నుంచి 2011, జనవరి 1 మధ్యలో జన్మించి ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 20
లాస్ట్ డేట్: జూన్ 9
అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
రాత పరీక్ష: 2026, సెప్టెంబర్.
ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ: 2026, డిసెంబర్ – 2027, జనవరి.
స్టైఫండ్: శిక్షణా సమయంలో ప్రతి నెలా రూ.56,100 చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ (ఎస్ఎస్బీ), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ను సందర్శించవచ్చు.
శిక్షణా సమయంలో కేడెట్‌కు ప్రతి నెలా రూ. 56,100 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు. అభ్యర్థుల వసతి, భోజనం, యూనిఫాం, వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులకు సాయుధ దళాల్లో లెఫ్టినెంట్(ఆర్మీ) / సబ్ లెఫ్టినెంట్ (నేవీ) / ఫ్లయింగ్ ఆఫీసర్ (ఎయిర్ ఫోర్స్) హోదాతో శాశ్వత కమిషన్ కల్పిస్తారు.
శిక్షణ: ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు ఎంపికైన అభ్యర్థులకు పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడేళ్లు శిక్షణ ఉంటుంది. ఇక్కడ శిక్షణతోపాటు అభ్యర్థులకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ద్వారా బీఏ/ బీఎస్సీ/ బి.టెక్ డిగ్రీలను ప్రదానం చేస్తారు. అభ్యర్థులకు శారీరక దృఢత్వం, మానసిక సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, యుద్ధ వ్యూహాలు, విలువలపై కఠినమైన శిక్షణ ఇస్తారు.
స్పెషల్ ట్రైనింగ్: ఎన్డీఏలో మూడేండ్ల ఉమ్మడి శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులు తాము ఎంపికైన విభాగాలను బట్టి తదుపరి శిక్షణ కోసం వేర్వేరు అకాడమీలకు వెళ్తారు.
ఆర్మీ కేడెట్స్: ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ), డెహ్రాడూన్‌కు వెళ్తారు. ఇక్కడ ఏడాది శిక్షణ ఉంటుంది.
నేవీ కేడెట్స్: ఇండియన్ నావల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎజిమల (కేరళ)కు వెళ్తారు. ఇక్కడ ఏడాది శిక్షణ ఉంటుంది.
ఎయిర్ ఫోర్స్ కేడెట్స్: ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ), హైదరాబాద్‌కు వెళ్తారు. ఇక్కడ ఫ్లయింగ్ లేదా గ్రౌండ్ డ్యూటీస్ విభాగాల్లో ఏడాది నుంచి ఏడాదిన్నర శిక్షణ ఉంటుంది.
నావల్ అకాడమీ (ఎన్ఏ)- ఎజిమల (10+2 కేడెట్ ఎంట్రీ)
డైరెక్ట్ నావల్ అకాడమీ (ఐఎన్ఏసీ)కి ఎంపికైన అభ్యర్థులు నేరుగా కేరళలోని ఎజిమలకు వెళ్తారు. ఇక్కడ నాలుగేళ్ల శిక్షణ ఉంటుంది. ఇక్కడ బి.టెక్ డిగ్రీ కోర్సుతోపాటు పూర్తి స్థాయి నావికాదళ శిక్షణ ఇస్తారు.
ఇంటర్వ్యూ: రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇది కూడా 900 మార్కులకు జరుగుతుంది. ఇందులో అభ్యర్థుల ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ, నాయకత్వ లక్షణాలను పరీక్షిస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్
ఎన్డీఏ రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-–Iలో మ్యాథమెటిక్స్ 300 మార్కులకు, జనరల్ ఎబిలిటీస్ పరీక్ష 600 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులను కోత విధిస్తారు.
సిలబస్
పేపర్ - 1 మ్యాథమెటిక్స్: ఇది పూర్తిగా ఇంటర్మీడియట్ (10+2) స్థాయి గణితంపై ఆధారంగా ఉంటుంది. ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, ఎనలిటికల్ జామెట్రీ, డిఫరెన్షియల్ అండ్ ఇంటెగ్రల్ కాలిక్యులస్, వెక్టార్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
పేపర్ - 2 జనరల్ ఎబిలిటీ టెస్ట్ - జీఏటీ: ఈ పేపర్‌ను రెండు భాగాలుగా విభజిస్తారు.
పార్ట్- ఏ: అభ్యర్థి ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని, వ్యాకరణాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.
పార్ట్ - బి: ఇందులో ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, హిస్టరీ & ఫ్రీడమ్ మూవ్‌మెంట్, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తారు.
