వివాదంలో చిక్కుకున్న మంత్రి.. శివలింగం దగ్గరే చేతులు కడిగాడు

వివాదంలో చిక్కుకున్న మంత్రి..  శివలింగం దగ్గరే చేతులు కడిగాడు

ఉత్తరప్రదేశ్ మంత్రి సతీష్ శర్మ వివాదంలో చిక్కుకున్నారు. శివలింగం దగ్గరే చేతులు కడుక్కుంటున్న వీడియో వైరల్ అవుతోంది.  దీంతో ప్రతిపక్ష పార్టీ నేతలు మంత్రి సతీష్ శర్మపైనా విరుచుకుపడుతున్నారు.  2023 ఆగస్టు 27న బారాబంకిలో ఉన్న లోధేశ్వర్ మహాదేవ ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు చేశారు సతీష్ శర్మ . అనంతరం లింగం పక్కనే చేతులు కడిగారు. దీంతో మంత్రిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  దీనిపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించాలని కోరుతునన్నారు. మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.