వ్యాక్సిన్ ​సర్టిఫికెట్లు వస్తలేవ్

వ్యాక్సిన్ ​సర్టిఫికెట్లు వస్తలేవ్
  •    హైదరాబాద్​లో 50 వేల మందికి పైగా వ్యాక్సినేషన్ ​సమస్య
  •     టీకా తీసుకోనోళ్లకు తీసుకున్నట్లు మెసేజ్​లు
  •     రెండు డోసులు కంప్లీట్ ​అయినా.. అందని సర్టిఫికెట్లు
  •     ఆఫీసర్ల నిర్లక్ష్యంతో నగరవాసుల ఇబ్బందులు


 గ్రేటర్​ హైదరాబాద్ ​మున్సిపల్ ​కార్పొరేషన్ ​నిర్వహించిన స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్​లో కరోనా వ్యాక్సిన్ ​వేసుకున్న కొందరికి సర్టిఫికెట్లు రావడం లేదు. వ్యాక్సినేషన్ ​టైంలో ఆఫీసర్లు సరిగా రిజిస్ట్రేషన్లు చేయకపోవడం  సర్టిఫికెట్లు రాకా జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇదే సమస్యతో ఫస్ట్ ​డోస్ ​వేసుకున్న కొందరికి సెకండ్​డోస్​కు మెసేజ్​లు రావడం లేదు. దీంతో వారు మూడు, నాలుగు నెలలు పూర్తయినా సెకండ్​ డోసు వేసుకోలేకపోతున్నారు. మరికొందరికి సెకండ్ డోసు వేసుకోకుండానే వేసుకున్నట్లు మెసేజ్​లు వస్తున్నాయి. ఇలా గ్రేటర్​లో దాదాపు50 వేల మంది వ్యాక్సినేషన్​ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెలాఖరు నుంచి మాల్స్, హోటళ్లు, పార్కులు, థియేటర్లు, ప్రభుత్వ ఆఫీసుల్లోకి వచ్చేవారికి వ్యాక్సిన్​ తీసుకున్న సర్టిఫికెట్ తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అలా చేస్తే సర్టిఫికెట్ ​రాని వల్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కూడా అందరికీ వ్యాక్సిన్​ వేయడం లేదు. కొన్ని చోట్ల సెంటర్లు ఎక్కడ పెడుతున్నారో కూడా జనానికి తెలియడం లేదు. 

బల్దియా తొందరపాటుతోనే..

జీహెచ్ఎంసీ మూడు నెలల క్రితం నిర్వహించిన వ్యాక్సినేషన్ డ్రైవ్​లో రోజూ 20 నుంచి 30 వేల మందికి వ్యాక్సిన్​ వేశారు. అయితే ఆ సమయంలో ఒక్కో సెంటర్​కి వేలాది మంది తరలి రావడంతో వ్యాక్సిన్​ వేయాలనే తొందరపాటులో కొందరికి రిజిస్ర్టేషన్​లు చేయకుండానే టీకా ఇచ్చారు. సర్వర్​ డౌన్​ ఉందని తరువాత మెసేజ్ వస్తుందని అప్పట్లో చెప్పినప్పటికీ ఇంకా మెసేజ్​లు రాలేదు. ఇప్పుడు మూడునెలలు పూర్తవడంతో సెకండ్​ డోసు ఎలా వేసుకోవాలని జనం ఆందోళన చెందుతున్నారు.  

24 కాలనీల్లో పూర్తయితే వంద శాతం

గ్రేటర్​పరిధిలో 4,846 కాలనీలు ఉన్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ ఈ నెల 9వ తేదీ వరకు 4,822 కాలనీల్లో వందశాతం వ్యాక్సినేషన్​ పూర్తయినట్లు ప్రకటించింది. అంటే 24 కాలనీల్లో వ్యాక్సిన్లు వేస్తే​ గ్రేటర్​లో వందశాతం వ్యాక్సినేషన్​ పూర్తయినట్లు ప్రకటించనుంది. కానీ గ్రౌండ్​ లెవల్​లో చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. వ్యాక్సిన్ వేసుకున్నోళ్లకు సర్టిఫికెట్లు రాకపోతుండగా, వ్యాక్సిన్ ​తీసుకోని వారికి తీసుకున్నట్లు మెసెజ్​లు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్​తోనే ఈ గందర గోళం నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.