12 ఏండ్ల పిల్లలకు టీకా

12 ఏండ్ల పిల్లలకు టీకా

దేశంలో మరో టీకా అందుబాటు లోకి వచ్చింది.  జైడస్ క్యాడిలా తయారు చేసిన త్రీ డోస్ జైకొవ్–డి వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి డీసీజీఐ శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ టీకాను పెద్దలు, 12 ఏండ్లు, ఆపై వయసు పిల్లలకు వేసేందుకు ఓకే చెప్పింది. 
టీకా జైకొవ్-డి వ్యాక్సిన్​కు కేంద్రం అనుమతి 
న్యూఢిల్లీ: కరోనాకు మన దేశంలో మరో టీకా అందుబాటులోకి వచ్చింది. అహ్మదాబాద్​కు చెందిన జైడస్ క్యాడిలా తయారు చేసిన త్రీ డోస్ జైకొవ్–డి వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి డీసీజీఐ శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ టీకాను పెద్దలు, 12 ఏండ్లు ఆపై వయసు పిల్లలకు వేసేందుకు ఓకే చెప్పింది. దీంతో దేశంలోనే పిల్లలకు అందుబాటులోకి వచ్చిన తొలి టీకాగా జైకొవ్–డి నిలిచింది. ప్రపంచంలోనే మొదటి డీఎన్ఏ టీకాగా, మన దేశంలో అందుబాటులోకి వచ్చిన ఆరో టీకాగా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. దేశంలో తయారైన మొదటి టీకాగా భారత్ బయోటెక్ కొవాగ్జిన్ గుర్తింపు పొందగా, రెండో స్వదేశీ టీకాగా జైకొవ్–-డి నిలిచింది.  టీకా ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి కోసం జులై 1న జైడస్ అప్లికేషన్ పెట్టుకుంది. దీన్ని పరిశీలించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎక్స్ పర్ట్ కమిటీ... టీకా ఎమర్జెన్సీ వాడకానికి పర్మిషన్ ఇవ్వాలని డీసీజీఐకి రికమండ్ చేసింది. 
ఏడాదికి 12 కోట్ల డోసులు.. 
ఏడాదికి 10 కోట్ల నుంచి 12 కోట్ల డోసుల తయారీకి ప్లాన్ చేస్తున్నామని జైడస్ క్యాడిలా తెలిపింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీతో కలిసి టీకాను తయారు చేశామని చెప్పింది. 28వేల మందిపై ఫైనల్ స్టేజ్ ట్రయల్స్ నిర్వహించామని, టీకా పనితనం 66.6 శాతంగా ఉందని పేర్కొంది.