ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా సంక్షిప్త వార్తలు

మంచిర్యాల, వెలుగు: ఇటీవల వచ్చిన వరదలకు ఎన్టీఆర్​ నగర్​లో దెబ్బతిన్న ఇండ్ల పునర్నిర్మాణానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు ఆర్థికసాయం అందించారు. 15 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ. లక్షన్నర శనివారం అందజేశారు. మంచిర్యాలలో వరదలు వచ్చినప్పటి నుంచి బాధిత కుటుంబాలకు సేవా భారతి, రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం, నిత్యావసర సరుకులు, పిల్లలకు స్కూల్ కిట్స్ అందించామని తెలిపారు. వరదలతో దెబ్బతిన్న వంద ఇండ్లను పునర్నిర్మించుకునేందుకు సాయం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 65 కుటుంబాలకు రేకులు, సిమెంట్, ఐరన్​ పైపులు అందించామన్నారు. వరదలు వచ్చి రెండు నెలలు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పైసా సాయం చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించి ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. నాయకులు వెంకటేశ్వర్​రావు, అమిరిశెట్టి రాజు, బోయిని దేవేందర్, పల్లి రాకేష్, జోగుల శ్రీదేవి, నాగుల రాజన్న, ముదాం మల్లేష్, కుచాడి సతీశ్​ పాల్గొన్నారు. 

డాక్టర్లను నియమించండి

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఆదిలాబాద్​రిమ్స్​సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్​లో డాక్టర్లను నియమించాలని  బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​శంకర్ డిమాండ్ చేశారు. శనివారం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ఎదుట ధర్నా నిర్వహించారు. పేదలు, గిరిజనులకు మెరుగైన వైద్య సేవల అందివ్వాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోడీ ప్రధానమంత్రి స్వస్థ్​ సర్వేక్షన్ యోజన పథకం ద్వారా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేశారని గుర్తుచేశారు. కానీ...  రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఎమ్మెల్యే  జోగు రామన్న అలసత్వం కారణంగా 2018 లో పూర్తి  కావాల్సిన హాస్పిటల్​ 2021 లో  పూర్తయ్యిందన్నారు. డాక్టర్లను నియమించకుండానే ఆసుపత్రి ప్రారంభించి ఆసుపత్రిని అబాసుపాలుజేశారన్నారు. ధర్నాలో పార్టీ లీడర్లు లాలా మున్న, దినేశ్ మాటోలియా, అధినేత్, జోగు రవి, లోక ప్రవీణ్ రెడ్డి, ఆకుల ప్రవీణ్, సోమ రవి, రత్నాకర్ రెడ్డి,  ముకుంద్ రావు, రాజేశ్, శ్రీనివాస్, స్కవత్, వసీం, మహేందర్, సచిన్ తదితులు పాల్గొన్నారు. 

మున్సిపల్ వైస్ చైర్మన్​తో ప్రాణహాని ఉంది

బెల్లంపల్లి,వెలుగు: టీఆర్ఎస్ లీడర్, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఆయన బావమరిది సుంకె సతీశ్​తో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బొద్దున రాజేశ్వరి తెలిపారు. శనివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో కొడుకు బొద్దున శ్రీకాంత్, కోడలు బొద్దున సౌమ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈనెల ఒకటిన మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఆయన  బావమరిది సుంకె సతీశ్, టీఆర్ఎస్ లీడర్లు కుంబాల రాజేశ్, బియ్యాల అంజయ్య, అలీ, కాసర్ల యాదగిరి వచ్చి మట్టి కుప్ప రోడ్డుపై నుంచి తీయాలని లేదంటే  జేసీబీతో తొక్కించి చంపుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలో బండతో తన భర్త వెంకటేశ్​పై దాడిచేశారని తెలిపారు. తమ కుటుంబానికి ఎప్పటికైనా సుదర్శన్, సతీశ్​తో ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని కోరారు. 

ఇద్దరు కౌన్సిలర్లకు షోకాజ్ నోటీసులు

భైంసా, వెలుగు: భైంసా మున్సిపాలిటీ లోని ఇద్దరు కౌన్సిలర్లకు శనివారం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 20వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ ఖాదర్, 8వ వార్డు కౌన్సిలర్ తోట విజయ్ కుమార్ 2021 సంవత్సరంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నోటీసులో పేర్కొన్నారు. ఇది ఇలాఉంటే 2021లో భైంసాలో జరిగిన అల్లర్లలో వీరిద్దరు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై విడుదలై కౌన్సిలర్లుగా కొనసాగుతున్నారు.

స్వచ్ఛ గురుకుల్​ను సక్సెస్​ చేయాలి 

ఆదిలాబాద్/​మంచిర్యాల,వెలుగు: జిల్లాలోని సోషల్ వెల్ఫేర్  స్కూళ్లలో ఈ నెల 5 నుంచి 11 వరకు నిర్వహించనున్న స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమాన్ని సక్సెస్​చేయాలని కలెక్టర్ భారతి హోళికేరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో కలిసి వాల్​ పోస్టర్​ను రిలీజ్​చేశారు. అనంతరం రివ్యూ నిర్వహించారు. స్కూల్ ఆవరణ, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, క్లాస్ రూమ్స్, టాయ్ లెట్స్​క్లీన్​గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భోజనానికి ముందు స్టూడెంట్లు తప్పనిసరిగా చేతులు క్లీన్​చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఆసిఫాబాద్​లో కలెక్టర్​రాహుల్​రాజ్​స్వచ్ఛ గురుకుల్​పోస్టర్​ రిలీజ్​చేశారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ చాహత్ బాజ్ పేయ్, డీసీవో బాలరాజు, టీచర్లు సంగీత, జ్యోతి, సంధ్యారాణి, శ్రీనివాస్ తదితరులు 
పాల్గొన్నారు.

నీళ్ల కోసం టీఆర్ఎస్ ​కౌన్సిలర్​ ధర్నా

కాగజ్ నగర్, వెలుగు: నీళ్ల కోసం అధికార పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ రోడ్డు మీద ధర్నా చేశాడు. కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ పట్టణంలోని 20వ వార్డు కౌన్సిలర్ జూపాక మదన్ శనివారం కాలనీవాసులతో కలసి ఆందోళనకు దిగాడు. తన వార్డులో వారం రోజులుగా మంచినీళ్లు రావడం లేదని, కొంతమంది సిబ్బంది కావాలనే సరఫరా ఆపేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాటర్ ట్యాంక్ నిండి రోడ్డుపై నీళ్లు వృథాగా పోతున్నాయని, కానీ కాలనీ వాసులకు మాత్రం సరఫరా చేయడం లేదన్నారు. కమిషనర్ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టాడు. మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీశ్​కుమార్ సముదాయించడంతో ఆందోళన విరమించారు.

ఓటర్​కార్డులకు ఆధార్​ సీడింగ్​పై అవగాహన కల్పించాలి

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఓటర్ గుర్తింపు కార్డులకు ఆధార్ సీడింగ్​పై అవగాహన కల్పించాలని కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్​లో మున్సిపల్ రిసోర్స్​పర్సన్స్, కమ్యూనిటీ ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ పోషణ మాసం, సామ్​ మామ్ పిల్లల పర్యవేక్షణలపై సీడీపీవోలు, సూపర్ వైజర్​లతో సమావేశం నిర్వహించి పలుసూచనలు చేశారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పి,శ్రీజ, డీఎంహెచ్​వో నరేందర్ రాథోడ్, ఆర్డీవో రమేశ్​రాథోడ్, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు

చెన్నూర్​, వెలుగు: మావోయిస్టుల కదలికల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ర్ట సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద గల అంతర్రాష్ర్ట బ్రిడ్జి, వేమనపల్లి మండలంలోని ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీసీపీ అఖిల్​ మహాజన్​, జైపూర్​ ఏసీపీ నరేందర్​ ఆదేశాలతో కోటపల్లి సీఐ విద్యాసాగర్​ ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు చేపట్టారు. స్పెషల్ పార్టీ, టీఎస్​పీఎస్​సీ సిబ్బంది, లోకల్​ పోలీసులతో ఏరియా డామినేషన్, ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని గ్రామాలు, మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లోని ఫెర్రీ పాయింట్లను సందర్శించారు. ఆయా మార్గాల్లోని కల్వర్టులను చెక్ చేశారు. పడవలు నడిపే వాళ్లు, చేపలు పట్టేవాళ్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. చెన్నూర్​, సిరొంచ రూట్​లో వచ్చిపోయే బస్సులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నీల్వాయి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మావోయిస్టుల ప్రభావిత గ్రామాల్లో మావోయిస్టు నేతల ఫొటోలు, వారిపై ఉన్న రివార్డు వివరాలతో పోస్టర్లు వేశారు. కోటపల్లి, నీల్వాయి ఎస్సైలు వెంకట్​, నరేష్​తో పాటు 50 మంది పోలీసులు పాల్గొన్నారు.  

రాజేందర్​రెడ్డికి ఉత్తమ సైంటిస్ట్​ అవార్డ్​

ఇచ్చోడ,వెలుగు: ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 8వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ వ్యవసాయ శాస్ర్తవేత్తలు, బోదనేతర సిబ్బంది, ఉత్తమ రైతులు పలువురికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇచ్చోడ రెడ్డికాలనీకి చెందిన వ్యవసాయ శాస్ర్తవేత్త  డాక్టర్​రాజేందర్​రెడ్డి రాష్ట్రస్థాయి ఉత్తమ శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. శనివారం హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్​ ప్రొఫెసర్​ బీఎస్​మూర్తి నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. సోయా చిక్కుడుపై చేసిన పరిశోధనలకు ప్రశంస దక్కిందని రాజేందర్​రెడ్డి తెలిపారు.

విద్యార్థుల మరణాలు ఆఫీసర్లకు పట్టవా?

ఆసిఫాబాద్,వెలుగు: వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకుంటున్న స్టూడెంట్లు సమస్యలతో సతమతమవుతున్నారని సీపీఎం రాష్ట్ర నాయకుడు బండారు రవికుమార్ ఆరోపించారు. శనివారం  సీపీఎం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. స్టూడెంట్లు చనిపోతే గవర్నమెంట్ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మినరల్​వాటర్​అందక పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే గిరిజన గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. చనిపోయిన నలుగురు స్టూడెంట్ల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కుశన రాజన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ముంజం శ్రీనివాస్, అల్లూరి, లోకేశ్, గొడిసెల కార్తీక్, ముంజం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: గణేశ్​ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ మతపెద్దలు, ముస్లిం మత పెద్దల సమక్షంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. గణేశ్​ మండపాల వద్ద, శోభాయాత్రలో డీజేలకు పర్మిషన్​ లేదన్నారు. ప్రజలు అత్యవసర సమయంలో 100కు డయల్​ చేయాలన్నారు. సీఐలు సురేందర్, కె.శ్రీధర్, ఆర్ఐలు వెంకటి, శ్రీపాల్, ఈఈ తిరుపతి, టీపీవో అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

6న స్టూడెంట్స్​కు పోటీలు
భైంసా,వెలుగు: గణేశ్​నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 6న నర్సింహ కల్యాణ మంటపంలో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభాపాటవ పోటీలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విలాస్ గాదేవార్, డాక్టర్​రామకృష్ణాగౌడ్ తెలిపారు. శనివారం స్థానికంగా కరపత్రాలు రిలీజ్​చేశారు. ఉపన్యాస, చిత్రలేఖనం, ఏకపాత్రలు, భక్తిగీతాలు, ఫ్యాన్సీ డ్రెస్​, డ్యాన్స్​లు, భరతనాట్యం, కూచిపూడి, పేరిణి నృత్య పోటీలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ట్రెజరర్​కొర్వ చిన్నన్న, సభ్యులు డాక్టర్​నగేశ్, గాలి రాజు, గోపాల్​ తదితరులు ఉన్నారు.