హైదరాబాద్, వెలుగు : బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) సెలెక్టెడ్ స్టూడెంట్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల 8 నుంచి జరగనుంది. ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం 1,404 మందితో సెలెక్టెడ్ లిస్టును ఇటీవల అధికారులు రిలీజ్ చేశారు. వారిలో ఒకటి నుంచి 500 మంది వరకు ఈ నెల 8న బాసరలోని వర్సిటీ క్యాంపస్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
వెరిఫికేషన్‌కు అటెండ్ కాకపోతే ఆ స్టూడెంట్ సీట్ క్యాన్సల్ చేస్తామని, మెరిట్ ప్రకారం తర్వాతి స్టూడెంట్‌కు దాన్ని కేటాయిస్తామని తెలిపారు. వెరిఫికేషన్‌కు టెన్త్ మెమో, టీసీ, నాల్గవ తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్, రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకురావాలని అధికారులు సూచించారు.
